LJP leader
-
సుశాంత్ మృతిపై విచారణకు ఎల్జేపీ నేత డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై విచారణ చేపట్టాలని లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కోరారు. ముంబైలోని బాంద్రా నివాసంలో జూన్ 14న సుశాంత్ రాజ్పుట్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ను బిహార్ ముద్దుబిడ్డగా అభివర్ణించిన చిరాగ్ పాశ్వాన్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో సుశాంత్‌కు న్యాయం జరగాలని బిహార్ ఆకాంక్షిస్తుందని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఇక ముందు వర్గపోరు, బంధుప్రీతికి మరొక ప్రతిభ కలిగిన నటులెవరూ బాధితులుగా మారకుండా ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని బిహారీల తరపున కోరుతున్నానని పాశ్వాన్ అంతకుముందు ఠాక్రేతో ఫోన్లో స్పష్టం చేశారు. సుశాంత్ కుటుంబానికి సన్నిహితుడిగా అతడు కష్టపడి పనిచేసే ప్రతిభావంతుడని గుర్తుచేసుకున్నారు. కాగా బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోమవారం పట్నాలో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజ్‌పుత్ మరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైందని, ఆయన మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని తివారీ డిమాండ్ చేశారు. చదవండి : సుశాంత్ నెలఖర్చు ఎంతంటే..? -
బరిలో బాబాయి vs అబ్బాయి!
కళ్యాన్పూర్: ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోటాపోటీగా తలపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బాబాయి-అబ్బాయి పోరు ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌కు బంధువులైన ప్రిన్స్ రాజ్ (26), మాజీ ఎంపీ మహేశ్వర్ హజారి (44) కళ్యాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రిన్స్ రాజ్ ఎల్జేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుడగా, హజారి జేడీయూ నుంచి పోటీకి దిగారు. కళ్యాన్పూర్ జేడియూ ఇలాకా అయినప్పటికీ, వరుసకు బాబాయి- అబ్బాయిలు అయిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రిన్స్ రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్ కొడుకు. రాంచంద్ర పాశ్వాన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజారిని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో తలపడుతున్న హజారి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. -
బరిలో బాబాయి vs అబ్బాయి!
కళ్యాన్పూర్: ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోటాపోటీగా తలపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బాబాయి-అబ్బాయి పోరు ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌కు బంధువులైన ప్రిన్స్ రాజ్ (26), మాజీ ఎంపీ మహేశ్వర్ హజారి (44) కళ్యాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రిన్స్ రాజ్ ఎల్జేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుడగా, హజారి జేడీయూ నుంచి పోటీకి దిగారు. కళ్యాన్పూర్ జేడియూ ఇలాకా అయినప్పటికీ, వరుసకు బాబాయి- అబ్బాయిలు అయిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రిన్స్ రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్ కొడుకు. రాంచంద్ర పాశ్వాన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజారిని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో తలపడుతున్న హజారి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.