local polls
-
స్ధానిక ఎన్నికలు: 29 వార్డులు ఎంఐఎం కైవసం
సాక్షి,హైదరాబాద్: యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం 78 వార్డులకు పోటీ చేసి 29 వార్డుల్లో గెలుపొందింది. ఫిరోజాబాద్‌లో 11 సీట్లను, మహుల్ అజంగర్‌లో 11 సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. సంభల్, అమ్రోహ,మీరట,భాగ్పట్‌లలో రెండేసి సీట్లను, ఘజియాబాద్, కాన్పూర్,బిజ్నోర్,అలహాబాద్,సీతాపూర్ కార్పొరేషన్లలో ఒక్కో స్ధానాన్ని దక్కించుకుంది. ఫిరోజాబాద్ మేయర్ స్ధానానికి జరిగిన పోరులో తమ పార్టీ రెండో స్ధానంలో నిలిచిందని, తమ మేయర్ అభ్యర్థికి 56,536 ఓట్లు పోలయ్యాయని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. బీజేపీ మేయర్ అభ్యర్థి నూతన్ రాథోర్ దాదాపు లక్ష ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలుపొందారు. యూపీ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన ప్రజలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. -
బీఎస్పీకి ఓటేస్తే బీజేపీకి వెళ్లింది..
సాక్షి,మీరట్: యూపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంల లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. మీరట్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓ వ్యక్తి బీఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి వెళ్లినట్టు గమనించడంతో కలకలం రేగింది. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళుతున్నట్టు వీడియో వెల్లడికావడంతో బీజేపీయేతర పార్టీలు తీవ్రస్ధాయిలో అభ్యంతరం తెలిపాయి. మిషన్ పనిచేయడం లేదంటూ అధికారులు ఈవీఎంను మార్చినా ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి. తస్లీమ్ అహ్మద్ అనే ఓటరు బీఎస్పీకి ఓటేసేందుకు విఫలయత్నం చేస్తున్న వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తుండగా స్పందించిన అధికారులు ఈవీఎంను మార్చివేశారు. పనిచేయని ఈవీఎంను వెనువెంటనే మార్చామని మీరట్ జిల్లా అదనపు మేజిస్ర్టేట్ ముఖేష్ కుమార్ చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఈవీఎంల్లో లోపాలు తలెత్తడం పట్ల మాజీ బీఎస్పీ ఎంఎల్ఏ యోగేష్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్రాలోనూ ఈవీఎంలతో సమస్యలు తలెత్తాయి. గౌతమ్‌నగర్‌లోని బూత్ నెంబర్ 69లో ఏ బటన్‌ను ప్రెస్ చేసినా బీజేపీకే వెళుతున్నట్టు ఓటర్లు గుర్తించారు.చాలా చోట్ల ఇవే ఫిర్యాదులు రావడంతో అరగంట పాటు పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఈవీఎంలను సరిచేసిన అనంతరం తిరిగి పోలింగ్‌ను కొనసాగించారు. -
నిజామాబాద్ ఎమ్మెల్సీగా భూపతిరెడ్డి ఏకగ్రీవం
నిజామాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ప్రతిపక్షాన్ని చిత్తు చేసింది. ఇప్పటికే వరంగల్, మెదక్ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్.. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో రెండు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. మెదక్, నిజామాబాద్‌లో గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లైంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకోవడం దాదాపుగా ఖాయమైందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దాంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.