సాక్షి,మీరట్: యూపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంల లోటుపాట్లు చోటుచేసుకున్నాయి. మీరట్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓ వ్యక్తి బీఎస్‌పీకి ఓటు వేస్తే బీజేపీకి వెళ్లినట్టు గమనించడంతో కలకలం రేగింది. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళుతున్నట్టు వీడియో వెల్లడికావడంతో బీజేపీయేతర పార్టీలు తీవ్రస్ధాయిలో అభ్యంతరం తెలిపాయి. మిషన్ పనిచేయడం లేదంటూ అధికారులు ఈవీఎంను మార్చినా ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి.
తస్లీమ్ అహ్మద్ అనే ఓటరు బీఎస్‌పీకి ఓటేసేందుకు విఫలయత్నం చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుండగా స్పందించిన అధికారులు ఈవీఎంను మార్చివేశారు. పనిచేయని ఈవీఎంను వెనువెంటనే మార్చామని మీరట్ జిల్లా అదనపు మేజిస్ర్టేట్ ముఖేష్ కుమార్ చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఈవీఎంల్లో లోపాలు తలెత్తడం పట్ల మాజీ బీఎస్‌పీ ఎంఎల్‌ఏ యోగేష్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగ్రాలోనూ ఈవీఎంలతో సమస్యలు తలెత్తాయి. గౌతమ్‌నగర్‌లోని బూత్ నెంబర్ 69లో ఏ బటన్‌ను ప్రెస్ చేసినా బీజేపీకే వెళుతున్నట్టు ఓటర్లు గుర్తించారు.చాలా చోట్ల ఇవే ఫిర్యాదులు రావడంతో అరగంట పాటు పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఈవీఎంలను సరిచేసిన అనంతరం తిరిగి పోలింగ్‌ను కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment