నిట్ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షురూ..
నేటి నుంచి లాకింగ్ చాయిస్... హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
హన్మకొండ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూలై 10 నుం చి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో సీటు అలాట్మెంట్ కోసం లాకింగ్ చాయిస్ ను చేసుకోవాలి. ఆన్లైన్ ఠీఠీఠీ.ఛిట్చఛ.జీఛి.జీ ద్వారా సీటు అలాట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్. సోమయాజులు తెలిపారు. జూలై 14న మొదటి విడత సీట్ అలాట్మెంట్, అదేరోజు నుంచి జూలై 17 సాయంత్రం 5గంటలలోగా రిపోర్టు చేయాల్సి ఉం టుందన్నారు. జులై 19న రెండో విడత సీటు అలాట్మెంట్, అదేరోజు నుంచి 21 సాయంత్రం 5గంటల వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. జూలై 23న మూడో విడత సీట్ అలాట్మెంట్, అదేరోజు నుంచి 25 సాయంత్రం 5గంటల వరకు రిపోర్టింగ్ చేయూ ల్సి ఉంటుంది.
అలాట్మెంట్ను సరెండర్ చేసుకోవాలనుకుంటే జూలై23 నుంచి 25 సాయంత్రం వరకు సీటు అలాట్మెంట్ చేసుకున్న ఇనిస్టిట్యూట్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నాలుగో విడత మాడిఫికేషన్ చాయిస్ జూలై 23నుంచి 26 సాయంత్రం 5గంటల వరకు... సీట్ అలాట్మెంట్ జూలై 28న ఉంటుంది. ఆగస్టు 2న ఇంటర్నల్ స్లైడింగ్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు స్పాట్ రౌండ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ చాయిస్ లాకింగ్, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఆగస్టు 8న స్పాట్రౌం డ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. విద్యార్థులు రిపోర్టింగ్ చేయడానికి నిట్‌లో రిపోర్టింగ్ సెంటర్‌ను, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లాబొరేటరీలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.