ఆధిక్యంలో ఆనంద్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ ప్రిలిమినరీస్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడో రౌండ్లో విషీ... ఆండ్రి ఇస్ట్రాటెక్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
ఈ రౌండ్ అనంతరం మొత్తం ఏడు పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఇంగ్లండ్ కు చెందిన ల్యూక్ మెక్షేన్ను ఓడించాడు. రెండో రౌండ్లో మైకేల్ ఆడమ్స్‌పై తెల్ల పావులతో ఆడిడ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో మిగిలిన మూడు రౌండ్లలో కనీసం ఒక్క గేమ్‌లో గెలిచినా ఆనంద్ క్వార్టర్స్‌కు చేరుకుంటాడు. 16 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.