lorry hit bike
-
ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలంలో ఓ లారీ.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్‌తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్‌పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
దారుణం.. బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుని..
హత్నూర(సంగారెడ్డి): బైక్‌ను లారీ ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఊట్ల శ్రీకాంత్, అర్చన భార్యాభర్తలు. శుక్రవారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం స్వగ్రామమైన మెదక్ జిల్లా వెంకట్రావ్ పెట గ్రామానికి పల్సర్ బైక్ పై బయలుదేరారు. దౌల్తాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ ఉండటంతో శ్రీకాంత్ బైక్‌ను స్లో చేశాడు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వారి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. వారిద్దరినీ లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. లారీ టైర్ల కింద ఇరుక్కుపోయిన వారిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వారిని పోలీసు వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ
యువకుడికి తీవ్రగాయాలు ధారూరు: బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం అంపల్లి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సంగమేశ్వర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుదోట్ల గ్రామానికి చెందిన కొంకలి అనంతయ్య(26) పని నిమిత్తం బైక్‌పై ధారూరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అంపల్లి గ్రామ సమీపంలోని పౌల్ట్రీఫారం దగ్గర కంకర బూడిదను ఖాళీ చేసి వస్తున్న ఓ టిప్పర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్ టిప్పర్ వెనక టైర్ దగ్గర ఇరుక్కుపోయింది. బైక్‌పై ఉన్న అనంతయ్య తలకు, ఇతర భాగాలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో తాండూర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, అనంతయ్యకు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం ఈర్లపల్లికి చెందిన ఓ యువతితో ఆగస్టు 11న వివాహం నిశ్చయించారు. అంతలోనే ప్రమాదం జరగడంతో క్షతగాత్రుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. టిప్పర్ డ్రైవర్ బాలయ్య నిర్లక్ష్యమే ప్రమాదం జరిగిందని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను పట్టుబట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.