losses for farmers
-
పోగొట్టుకున్న చోటనే వెతకాలి..!
సాక్షి, మహబూబాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్) తగ్గేదేలే అంటూ మిర్చి సాగు.. గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్‌లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 2 లక్షలు నష్టం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. వేరే పంట వేయలేక.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూడా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు. జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్ గుళికలను వేయాలి. – కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల) ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు -
రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాజు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగరి గ్రామం. ఎకరం పొలంలో టమాటా సాగు చేశాడు. మంగళవారం 18 బాక్సులు ఆటోలో వేసుకుని సిద్ది పేట కూరగాయల మార్కెట్‌కు వచ్చాడు. వ్యాపారులు 24 కిలోలు ఉండే ఒక్కో బాక్స్‌ను రూ.60 నుంచి రూ.70 మధ్య అడిగారు. రూ.60కి ఇస్తే కూలీ కూడా రాదని ఆవేదన చెందాడు. మూడు బాక్స్‌లను రూ.100 చొప్పున అమ్మగలిగాడు. మిగిలిన 15 బాక్స్‌లు తక్కువ ధరకు అమ్మేం దుకు మనసొప్పక తిరిగి తీసుకెళ్లిపోయాడు. ఇదే మార్కెట్లో వ్యాపారులు కిలో టమాటా రెండింతల ధరకు విక్రయిస్తూ లాభం పొందడం చూసి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ►ఈ ఏడాది కూరగాయల దిగుబడి బాగానే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మార్కెట్‌కు సుమారు 2లక్షల క్వింటాళ్లు అధి కంగా దిగుబడి వచ్చింది. ►మొదట్లో బాగానే ఉన్నా, రైతుల ఆశలపై లాక్డౌన్ నీళ్లు చల్లింది. కూలీల కొరత, రవాణా సమస్యగా మారితే, వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు తరలిస్తున్న రైతు లను హోల్‌సేల్ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ►లాక్‌డౌన్‌ను సాకుగా చూపుతూ డిమాండ్ లేదని, ధర లేదని చెబుతూ రైతులకు నామమాత్రపు ధరనే చెల్లిస్తు న్నారు. లాక్డౌన్ సడలింపు సమయం తక్కువగా ఉండ టంతో రైతులూ అయినకాడికి అమ్ముకుంటున్నారు. ► రైతులకు కుచ్చుటోపీ పెడుతూ తక్కువ ధరకు కొంటున్న హోల్‌సేలర్లు.. మళ్లీ అదే లాక్డౌన్ కారణంగా కూరగాయలు రావడం లేదంటూ, రెండు మూడింతల అధిక ధరలకు ప్రజలకు విక్ర యాలు జరుపుతున్నారు. ►ఇక రిటైల్ మార్కెట్లో స్థానిక వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి అమ్ముతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ►కనీసం పెట్టుబడి కూడా దక్కని విధంగా తన పంటను అమ్ముకుంటున్న రైతు, బయటి మార్కెట్లో మండి పోతున్న రేట్లు, వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్న తీరు చూసి దిగులుపడుతున్నాడు. అమ్మబోతే అలా.. కొనబోతే ఇలా.. ఇతని పేరు కానుగంటి రాజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన రైతు. ఇతను ఇరవై ఐదు గుంటల భూమిలో వంకాయ, సొరకాయ, ఇతర కూరగాయలు సాగు చేస్తున్నాడు. రూ.52 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కూరగాయల సాగులో పని చేస్తుంటారు. పంట దిగుబడి మంచిగా వస్తుందనుకున్న సమయంలో లాక్డౌన్ వచ్చి పడింది. రోజూ వంకాయలను తెంపుకొని కురవి, మరిపెడ మార్కెట్లకు వెళ్లి అమ్మబోతే కిలో పది రూపాయలకు అడుగుతున్నారు. సొరకాయ రూ.5కే అడుగుతున్నారు. చేసేదేమీ లేక ఆ రేటుకే వేసి వస్తున్నామని రాజు వాపోయాడు. అదే వ్యాపారి రిటైలర్లు, ప్రజలకు కిలో వంకాయలు రూ.40కి, సొరకాయ రూ.20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: దిగుబడి ఎక్కువ అయితే ధరలు తగ్గుతాయన్న మార్కెట్ సూత్రం రాష్ట్రంలోని కూరగాయల వ్యాపారులకు వర్తించడం లేదు. రాష్ట్రంలో అటు హోల్‌సేల్ మార్కెట్లలో, ఇటు రిటైల్ వ్యాపారుల వద్ద కూరగాయల ధరలు మండి పోతున్నాయి. లాక్‌డౌన్‌ను సాకుగా చెబుతూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్ర యిస్తున్నారు నేరుగా రైతు దగ్గరి నుంచి కొనుగోలు చేసి అమ్మే హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ముఖ్యమైన కూరగాయల్లో 95% రకాల ధరలు పెరిగాయని, ఇందులో కొన్ని 30 శాతం పెరిగితే, మరికొన్ని 100 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిగుబడి పెరిగినా.. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 23 వరకు మొత్తం అన్ని రకాల కూరగాయలు కలిపి 5,75,268 క్వింటాళ్లు హోల్‌సేల్ మార్కెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లోకి వెళ్లాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి మే 23 వరకు 7,53,987 క్వింటాళ్లు వెళ్లాయని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2 లక్షల క్వింటాళ్ల కూరగాయలు ఎక్కువగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ ధరలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం గమనార్హం. లాక్డౌన్ విధించినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకు రవాణాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా వ్యాపారులు లాక్డౌన్ పేరిట అటు రైతుల్ని, ఇటు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు. హోల్‌సేల్‌కు, రిటైల్‌కు పొంతనే లేదు మరోవైపు హోల్‌సేల్ మార్కెట్ ధరలకు, రిటైల్ మార్కెట్ ధరలకు పొంతనే లేకుండా పోతోంది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో ఏడు రూపాయలు పలుకుతున్న టమాటా బహిరంగ మార్కెట్లో 15–20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి, వ్యాపారిని బట్టి మారిపోతుండడం గమనార్హం. రేట్ల పట్టికలు పెట్టరా? హోల్‌సేల్ మార్కెట్లలో కానీ, రిటైల్ వ్యాపారాలపై కానీ ఎక్కడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. గత ఏడాది మాదిరి మొబైల్ వాహనాల ద్వారా విక్రయం వంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి లాక్డౌన్ కాలంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయన్న విషయం ప్రభుత్వ వర్గాలకు కూడా తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ, కూరగాయల దుకాణాల వద్దా రేట్ల పట్టికలు పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడటంతో ఎక్కడో ఒక చోట తప్ప రేట్ల పట్టికలే కనిపించక పోవడం గమనార్హం. అసలే కరోనా.. ఆపై ధరల దడ ఓ పక్క కరోనాతో బతుకు భయం భయంగా మారింది. ఇళ్లలోనే ఉంటూ సరైన ఆహారమన్నా తీసుకుందామంటే పెరిగిన కూరగాయల ధరలతో దడ పుడుతోంది. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు కూరగాయలు ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలో కొనుగోలు చేద్దామంటే మార్కెట్లలో రద్దీతో భయమేస్తోంది. ఇక కాలనీల్లో ఉండే చిన్నపాటి షాపుల్లో కొనుగోలు చేయాలంటే ధరలు విపరీతంగా ఉంటున్నాయి. ఇదేమిటని అడిగితే కరోనాతో పెద్ద మార్కెట్లోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు. లాక్డౌన్ ముందు కిలో రూ.60 ఉన్న క్యారెట్, కాకరకాయ వంటివి ఇప్పుడు రూ.80కి చేరాయి. ఇక అన్ని కూరల్లో వాడే మిర్చి ధరలైతే చెప్పక్కర్లేదు. అప్పట్లో పావు కిలో రూ.10 ఉన్న మిర్చికి ఇప్పుడు రూ.20 పెట్టాల్సి వస్తోంది. జి.సుజాత,రామకృష్ణా కాలనీ, హన్మకొండ -
తళుకులు కోల్పోతున్న ‘తెల్లబంగారం’
తెల్లబంగారం ఉప్పు ఉత్పత్తిలో ఓ వెలుగు వెలిగిన గోపాలపురం ప్రస్తుతం గత వైభవానికి చిహ్నంగా మిగిలిపోయి కుమిలిపోతోంది. తెల్లదొరల కాలం నుంచి ఉప్పు ఉత్పత్తికి, రవాణా అనుమతులకు కేంద్ర కార్యాలయంగా భాసిల్లిన ఆ పల్లె ఇప్పుడు బతుకుతెరువు కోల్పోయి గోడుమంటోంది. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆ ఊరు ప్రస్తుతం అటు ఉపాధి లేక.. ఇటు భూములు పనికి రాక దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించక ముఖం చాటేసింది. కనీసం భూములు సేకరించి పరిహారం ఇస్తారనుకుంటే ఆ ప్రతిపాదనలు ముందుకు కదలించలేదు. ముత్తుకూరు: జిల్లాలోని ముత్తుకూరు మండలంలో తెల్లదొరల పాలనా వైభవానికి, సాధారణ ఉప్పు తయారీ ప్రాభవానికి కేంద్రంగా ఉన్న గోపాలపురంలో సాల్ట్ ఫ్యాక్టరీ దాదాపు మూతపడింది. ఉప్పు ఉత్పత్తి, అమ్మకాలు, రవాణాతో కళకళలాడిన ఆ గ్రామం ప్రగతికి దూరమై బోసిపోయింది. ఉప్పు ఉత్పత్తి లేక లైసెన్సీదారులు చెట్టుకొకరుగా చెదిరిపోయారు. ఊరినే నమ్ముకొన్న లైసెన్సీ సాగుదారులు దారిద్య్ర భారంతో కొట్టుమిట్టాడుతున్నారు. భూములు తీసుకుని పరిహారం ఇస్తారని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. పరిహారం కళ్ల చూడకుండానే కొందరు కాలం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో సాధారణ ఉప్పు ఉత్పత్తికి గోపాలపురం పెట్టింది పేరు. 1870లోనే తెల్లదొరల పాలనలో ఇక్కడ ఉప్పు తెల్లబంగారంగా రైతులను ఆదుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 770 ఎకరాల్లో ఏటా 20 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి జరిగింది. లీజు పద్ధతిలో 110 మంది లైసెన్సీదారులు తరతరాలుగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి చేసి, పడవలు, లారీలు, ఎద్దుల బండ్ల ద్వారా అమ్మకాలు, రవాణా జరిపారు. గోపాలపురం సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉప్పు ఉత్పత్తి ద్వారా 2,000 మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. కరిగిపోయిన ఉప్పు వైభవం సముద్రనీటితో నేరుగా ఉప్పు తయారు చేసి, శుద్ధి చేసే ఫ్యాక్టరీలు నిర్మితం కావడంతో సంప్రదాయ సేద్యం ద్వారా ఉత్పత్తి చేసే ఉప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం మొదలైంది. జిల్లాకే తలమానికంగా ఏర్పడిన కృష్ణపట్నంపోర్టులో ఐరన్‌ఓర్, బొగ్గు ఎగుమతి, దిగుమతులు ఉప్పు ఉత్పత్తికి శాపంగా మారాయి. పోర్టు నుంచి ఎగసిపడే దుమ్ము, ధూళి సాధారణ ఉప్పు ఉత్పత్తి, నాణ్యతను దెబ్బతీశాయి. కయ్యలను కలుషితం చేశాయి. క్రమంగా ఉత్పత్తి, ధరలు పడిపోయి, సాగు విస్తీర్ణం తరిగిపోయింది. 2009తో మొదలై 2012 నాటికి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పోర్టు విస్తరణకు ఉప్పు భూములు కృష్ణపట్నంపోర్టు విస్తరణకు ఉప్పు భూములు సేకరించే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. లైసెన్సీదారులకు పరిహారం ఇచ్చి, భూములు సేకరిస్తారన్న ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో లైసెన్సీలు రద్దయ్యాయి. కయ్యలు బీడు పడ్డాయి. ముళ్ల చెట్లతో సాల్ట్ భూములు అడవుల్లా మారాయి. నిల్వ చేసిన ఉప్పు కుప్పలు మట్టిపాలయ్యాయి. నలుగురు జిల్లా కలెక్టర్లు ఇక్కడి పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. గోపాలపురం సాల్ట్ కార్యాలయం శిథిలమై, కూలిపోయే దశకు చేరింది. ఒకే ఒక్కడు ఈ కార్యాలయాన్ని సంరక్షిస్తున్నాడు. రెండు సార్లు సీఎంను కలిశారు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, కృష్ణపట్నంపోర్టు చుట్టూ భూముల పరిహారం ఫైళ్లు అనేక మార్లు ప్రయాణం చేశాయి. ఎకరాకు రూ.15 లక్షల పరిహారం నిర్ణయిస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 డిసెంబరు 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం మొత్తం జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ చేయాలని పోర్టును సూచించింది. లైసెన్సీదారుల కష్టాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. పోర్టు నిర్వాహకులు, ఉన్నతాధికారులు, అధికార పార్టీ నాయకుల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగిపోయేలా తిరిగారు. మంత్రి సోమిరెడ్డి ద్వారా సాల్ట్ లైసెన్సీలు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి రెండు సార్లు సీఎం చంద్రబాబును కలిసి, తమ గోడు వెళ్లబోసుకొన్నారు. పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వకపోవడంతో లైసెన్సీలు నీరసించిపోయారు. సంపాదనకు దూరమై దారిద్య్రంలో మునిగిపోయారు. ఉప్పు వైభవం ముగిసిపోవడంతో గోపాలపురం కూడా అభివృద్ధికి దూరమై, కళావిహీనమైంది. 14 మంది లైసెన్సీదారులు కాలం చేశారు ఉప్పు ఉత్పత్తిలో పేరుపడిన 14 మంది లైసెన్సీలు తమ భూముల పరిహారం కళ్ల చూడకుండానే కాలం చేశారు. వీరిలో వాడా వేణుగోపాలరెడ్డి, వాడా వెంకటశేషమ్మ, ఈదూరు రామచంద్రారెడ్డి, కలిసెట్టి దామోదరం, బండి శ్రీనివాసులు, ఆలపాక వీరమ్మ, నరహరి సత్యనారాయణ, మోహనరావు, అనిసెట్టి శేషమ్మ, సిద్ధవరపు భాస్కర్‌రెడ్డి, కరణం రాధయ్య, గాలి దామోదరం, మారుబోయిన బాలకోటయ్య, రమణయ్య పరిహారం దక్కకుండానే గతించిపోయారు. తిరిగి తిరిగి అలిసిపోయాం – చేవూరు కృష్ణయ్య, లైసెన్స్‌దారుడు 4 ఎకరాల్లో ఉప్పు సాగు చేశాను. సాగు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యాము. పరిహారం కోసం కాళ్లు అరిగిపోయేలా తిరిగాము. అటు నాయకులు, ఇటు అధికారులు సాయం చేయకపోవడంతో దిక్కుతోచక నీరసించిపోయాము. ఉప్పు తప్ప మరో వ్యాపకం లేదు – కలిచేటి సుబ్బారావు, లైసెన్స్‌దారుడు 3 ఎకరాల్లో ఉప్పు సాగును మాత్రమే నమ్ముకొని జీవనం సాగించాము. సాగుకు దూరమై, పరిహారం దక్కని దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించనేలేదు. చాలా మంది లైసెన్సీలు దివంగతులయ్యారు. అయినప్పటికీ పరిహారం మాత్రం దక్కలేదు. దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నా – కలిచేటి చంద్రశేఖర్, లైసెన్స్‌దారుడు నేను గతంలో 10 ఎకరాలు ఉప్పు సాగు చేసే వాడిని. ప్రస్తుతం ఉప్పు సాగు జరగడం లేదు. భూముల పరిహారం పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అందలేదు. లైసెన్సీదారులు చాలా మంది దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. పరిహారం చెల్లించకపోగా ఉప్పు భూముల్లో నిర్మాణాలు చేస్తున్నారు. -
ఆక్వాకు వైరస్ బెడద
గతేడాది వరదలు ఆక్వా రైతులను నిలువునా ముంచాయి. వరదలకు గుంతలు తెగిపోయి, ఏరియేటర్లు, మోటార్లు కొట్టుకుపోవడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ క్రమంలో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆలోచనతో అప్పులు చేసి మళ్లీ రొయ్యల సాగుకు సిద్ధమైన రైతులను ‘స్పాట్’ ఎటాక్ వణికిస్తోంది. గాలి ద్వారా వ్యాపించే స్పాట్ నివారణకు మందులు లేక రొయ్యలను తక్కువ కౌంట్లోనే పట్టేయాల్సి రావడంతో రైతులు నష్టపోతున్నారు. గూడూరు: జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగుచేపడుతున్నారు. గతేడాది వరదలు ముంచెత్తడంతో తీరంలో ఆక్వా సాగుచేస్తున్న రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆలోచనతో అప్పులు చేసి మరీ సాగు చేపట్టిన రైతులను ఎన్నడూ లేని విధంగా ఆదిలోనే వైట్‌గట్ వణికించింది. అయితే ప్రకృతి సిద్ధమైన యాంటీ బయోటిక్స్ అయిన వెల్లుల్లి జ్యూస్, పెరుగు, పులిసిన కల్లు, మెంతులు, చింతపండు రసం, తదితరాలను పోసి ఎలాగోలా కంట్రోల్ చేసుకోగలిగారు. ఈ క్రమంలోనే రొయ్యలను సునామీలా కొత్తగా స్పాట్ ఎటాక్ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వైట్‌గట్ ఒక గుంత నుంచి మరో గుంతకు వ్యాపించదు. కానీ స్పాట్ గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుండడం..నివారణకు మందులు లేకపోవడంతో రొయ్యలను తక్కువ కౌంట్లోనే పట్టేయాల్సి వస్తోంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మందులు లేవని చెబుతున్నారు– చంద్రమోహన్ రొయ్యలకు ఏ వ్యాధి సోకినా మందులు ఉంటే ఎంత ఖర్చు చేసైనా కాపాడుకుంటాం. కానీ స్పాట్ వ్యాధికి అసలు మందులే లేవని టెక్నీషియన్లు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుండడంతో వచ్చిన కాడికి చాలనుకుని రొయ్యలను పట్టేస్తున్నాం. నాసిరకం సీడ్‌తో నష్టపోతున్నాం– శ్రీనివాసులరెడ్డి అనుమతులు లేని హేచరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హెచరీల్లో తనిఖీలు లేకపోవడంతో వారు నాణ్యమైన సీడ్‌ను తయారు చేయడం లేదు. నాసిరకం సీడ్‌కు కొత్తరకం వ్యాధులు వస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం.