love failuer
-
ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : ప్రేయసి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్థాపం చెందిన ఓ ప్రేమికుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు పరిధిలోని సునకల్లు వద్ద అటవీ ప్రాంతంలో హర్షిత అనే యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పీలేరుకు చెందిన హర్షిత, ఈమె బంధువు కలికిరి మండలం గుట్టపాలెం పంచాయతీ వాడవాండ్లపల్లెకు చెందిన హేమంత్ (25) ప్రేమించుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో హర్షిత ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేని హేమంత్ శుక్రవారం హర్షిత మరణించిన సునకల్లు అటవీ ప్రాంతానికి చేరుకుని సెల్‌ఫోన్ లైవ్ వీడియోలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమంత్‌ను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో బాధితుడు కోలుకుంటున్నాడు. ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
హన్మకొండ: ప్రేమ విఫలమై రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గోవర్దనగిరి రైల్వేగేట్ సమీపంలోని ట్రాక్‌పై బుధవారం చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బాంజీపేట గ్రామానికి చెందిన దొంత సత్యనారాయణ–సావిత్రి దంపతుల కొడుకు శ్రీనివాస్ (25) రఘునాథపల్లిలో బైకు మెకానిక్ షాపు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. శ్రీనివాస్ కొంతకాలంగా ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలిసింది. ఆ అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది శ్రీనివాస్ గోవర్దనగిరి రైల్వే గేట్ సమీపంలోని ట్రాక్‌పై గుర్తు తెలియని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ అధికారి పరశురాములు తెలిపారు. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కుషాయిగూడ: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉపేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం..కుషాయిగూడ నాగార్జునగర్కు చెందిన గుంటి మల్లయ్య కుమారుడు మహేష్ (31) ఈసీఐఎల్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో అకౌంటెంట్ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి చెల్లెలు ఇంటికి వెళ్లి ..అక్కడి నుంచి తన బంధువు గిరీష్‌తో కలిసి తన కార్యాలయానికి వచ్చి అక్కడే నిద్రపోయాడు. ఉదయం కార్యాలయానికి వచ్చిన పనిమనిషి, బంధువు గిరీష్ లేచి చూసేసరికి మహేష్ ఓ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కన్పించాడు. కొంత కాలంగా ఓ యువతిని ప్రేమించాడని, చివరకు ప్రేమ విఫలమై మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుని తల్లి మధునమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ విఫలమైందని విద్యార్థిని ఆత్మహత్య
తిరువొత్తియూరు: క్రిష్ణగిరి జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ కళాశాల విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి జిల్లా నాయకనూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ (48) తాపీమేస్త్రి. ఇతని భార్య తమిళరసి పంచాయతీ మాజీ సర్పంచ్. వీరి చిన్న కుమార్తె దమయంతి (19) క్రిష్ణగిరిలో ఉన్న ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దమయంతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి సింగారపేట పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు చేరిన కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. విచారణలో విద్యార్థిని అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్ (25) అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు, అతను ఆమెను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించాడని, అతనిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన శ్రీనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రేమ పేరుతో నిలువునా మోసం
శ్రీనివాసపురం: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటాననడంతో అతని వెంట వెళ్లింది. తీరా పెళ్లిక నిరాకరించడంతో మానసిక వ్యథకు గురైన యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముళబాగిలు తాలూకా ఎన్ కురుబరహళ్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పాపలమ్మ కుమార్తె వెన్నెల (22) అనే యువతి ఎన్ జంగాలపల్లి గ్రామానికి చెందిన అంజప్ప కుమారుడు చంద్రశేఖర్ ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఇల్లు విడిచి వెళ్లారు. తల్లిదండ్రులు పోలీసుల సహకారంతో వారిని మళ్లీ తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో పంచాయతీ చేయగా, వెన్నెలను పెళ్లి చేసుకోనని ప్రియుడు చెప్పాడు. మోసపోయానన్న ఆవేదనతో వెన్నెల ఇల్లు విడిచి వెళ్లిపోయింది. చివరికి గ్రామ సమీపంలోని ఓ బావిలో ఆమె శవమై తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా చంద్రశేఖర్, అతని తల్లిదండ్రులు పరారయ్యారు. నంగలి పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. (చదవండి: కర్ణాటకలో దళితులపై అరాచకం..15 రోజుల పాటు చిత్రహింసలు) -
ప్రేమ విఫలమైందని ఆత్మహత్య
సెంటినరీకాలనీ : ప్రేమ విఫలమైందని కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన వీరగోని సాయిప్రసన్న(22) సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూటౌన్ సీఐ దేవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయిప్రసన్న గ్రామానికి చెందిన ఓ మైనర్‌ను ప్రేమిస్తున్నాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోయారు. తర్వాత సాయిప్రసన్న చీరతో ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి సోదరుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.