Love at first sight
-
తొలిచూపులో ప్రేమ.. నిజమేనా?
న్యూయార్క్ : ఓ వ్యక్తిని చూసిన మొదటి చూపులోనే ప్రేమ పుట్టడం అన్నది ఆలోచనలకు మామూలుగా అనిపించినా.. అనుభవించిన వారికి మాత్రం ప్రత్యేకమైనది. అంతవరకు పరిచయం లేని ఓ వ్యక్తిని చూడగానే ప్రేమ కలగటం.. వారితో వెనకజన్మ బంధమోదో ఉన్నట్లుగా అనిపించటం తొలిచూపులో కలిగే ప్రేమకున్న ప్రత్యేకత. దీన్ని కొంతమంది గట్టిగా విశ్వసిస్తుంటే మరికొంతమంది అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ‘‘తొలిచూపులోనే ప్రేమ పుడుతుందన్న విషయాన్ని మీరు నమ్ముతారా?’’ అని ఓ ప్రముఖ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రశ్నించినపుడు 60 శాతం మంది ఆడవాళ్లు, 70 శాతం మంది మొగవాళ్లు తొలిచూపు ప్రేమ నిజమని ఓటేశారు. తొలిచూపులో కలిగే ప్రేమతో ఏర్పడ్డ చాలా బంధాలు చివరివరకు నిలిచి ఉన్నాయని సదరు సర్వే వెల్లడించింది. కాగా, ఓ వ్యక్తిని మొదటిసారి చూడగానే మన మెదడులో చోటుచేసుకున్న రసాయనికి మార్పులే దీనికి కారణమంటున్నారు అమెరికాకు చెందిన కొందరు న్యూరోసైకోథెరపిస్టులు. మెదడులో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఎదుటి వ్యక్తిపై బలమైన ఆకర్షణ మొదలవతుందని చెబుతున్నారు. చాలా మంది ఈ ఆకర్షణననే ప్రేమగా భావిస్తారని పేర్కొన్నారు. అయితే ఇది ప్రత్యేకమైన ప్రేమ కాదని, జ్ఞాపకాలకు సంబంధించినది మాత్రమేనని వారు భావిస్తున్నారు. ఇది తొలిచూపులో ప్రేమ కాదని, ఆకర్షణ అని అంటున్నారు. అయితే ఈ తొలిచూపు ప్రేమ(?)తో ఏర్పడ్డ బంధాలలో కొన్ని మాత్రమే ఎక్కువకాలం కొనసాగాయని తేల్చారు. తొలిచూపులో ప్రేమ(?)పుట్టనంత మాత్రాన ఎదుటి వ్యకితో బంధాలను తక్కువగా అంచనా వేయటానికి లేదంటున్నారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆన్లైన్ ప్రేమలు అర్థం కావు
‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే ఉండదు. అదంతా పెద్ద ట్రాష్. ఈ ఆన్లైన్ ప్రేమలు ఎలా వర్కౌట్ అవుతాయో అస్సలు అర్థమే కాదు’’ అంటున్నారు కంగనా రనౌత్. ప్రేమలో తన అనుభవాల గురించి, ఆన్లైన్ ప్రేమల గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘లైఫ్‌లో ఏం జరిగినా అదంతా మన మంచికే జరిగిందని భావిస్తాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతిసారి అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడనుకుంటాను.. ‘దేవుడా! థ్యాంక్యూ నన్ను ఆ సంఘటన నుంచి కాపాడినందుకు’. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం కాదు. మనది ప్రేమ లేఖలు రాసే జనరేషన్ కాదు.. యూ ట్యూబ్ జనరేషన్. కానీ ఒక మనిషి గురించి తెలియకుండా, అతన్ని కలవకుండా ఆన్లైన్లో ఎలా ప్రేమించుకుంటారు? మన లైఫ్‌లో రిలేషన్షిప్స్ మీద కూడా ఇంటర్నెట్ ప్రభావం చూపించడం బాధగా ఉంది. మనందరం రోబోటిక్‌గా మారిపోయామేమో అనిపిస్తోంది. ఫ్యూచర్లో మనం కూడా మెకానికల్ అయిపోయి మెషిన్స్‌లా బిహేవ్ చేస్తామేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారామె. నిజమే.. కంగనా అన్నట్లు ఇంటర్నెట్ ప్రభావం ఈ జనరేషన్ మీద చాలా పడుతోంది. ఆన్ లైన్ ద్వారా మోసపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ద్వారా ప్రేమలో పడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
సినిమాను తలపించే 'తొలిప్రేమ' కథ
ఇదో ఖండాంతర 'తొలిప్రేమ' కథ. ఆమె.. ఇరాక్ నుంచి శరణార్థిగా వలస వెళ్లిన ముస్లిం యువతి. అతను మెసిడోనియాకు చెందిన క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మెసిడోనియాలో ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఈ ప్రేమకథ ఎలా మొదలైందంటే.. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో దియాల ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అక్కడి కల్లోల పరిస్థితుల మధ్య జీవించలేక దియాలకు చెందిన 20 ఏళ్ల నూర అర్కవాజీ కుటుంబం దేశం విడిచి యూరప్‌కు వలస వెళ్లాలని నిర్ణయించుకుంది. గతేడాది మార్చిలో నూర, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఇతర శరణార్థులతో కలసి మెసిడోనియా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్నవారిలో బాబి డొడెవ్స్కీ అనే అధికారికి మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడటం తెలుసు. శరణార్థుల సమస్యల తెలుసుకుని వారికి సాయం చేస్తుంటాడు. ఆ రోజే నూర, బాబి మధ్య తొలిసారి చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పలు భాషలు మాట్లాడే నూర.. బాబితో మాట కలిపింది. కొన్ని రోజుల్లోనే ఇద్దరూ సన్నిహితమయ్యారు. కలసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల ఆమోదంతో గతేడాది జూన్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారు. నూర ప్రస్తుతం బాబితో కలసి మెసిడోనియాలోని కమనోవోలో ఉంటోంది. కాగా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఆశ్రయం ఇచ్చిన జర్మనీకి వెళ్లిపోయారు. 15 ఏళ్లుగా పోలీస్ అధికారిగా బాబి పనిచేస్తున్నాడు. అంతేగాక ప్రొఫెషనల్ డాన్సర్. అతని డాన్స్ ట్రూప్ ప్రపంచమంతా పర్యటిస్తుంటుంది. మెసిడోనియాలో నివసించడానికి త్వరగా అలవాటుపడ్డానని నూర చెబుతోంది. ఈ దేశం, పట్టణం, ప్రజలు నన్ను శరణార్థిగా భావించరని, వారిలో ఒకరిలా కలసిపోయానని సంతోషం వ్యక్తం చేసింది. నూరను పెళ్లి చేసుకున్నందుకు చాలామంది ఆశ్చర్యపోయారని బాబి చెప్పాడు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకోవడమే దీనికి కారణమని అన్నాడు. ఇద్దరూ ఒకరి పేర్లను మరొకరు టాటూలు వేయించుకున్నారు. వీరి బంధం జీవితాంతం కొనసాగాలిన కోరుకుందాం. -
నాలుగో చూపులో ప్రేమ
న్యూయార్క్: తొలిచూపులోనే ప్రేమ.. మాటను విన్నాం. కానీ ఇది కల్పిత భావన అని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, లవ్ ఎట్ ఫోర్త్ సైట్ నిజమని అంటున్నారు అమెరికాలోని హామిల్టన్‌కి చెందిన పరిశోధకులు. కనీసం నాలుగుసార్లు కలుసుకుంటేనే ప్రేమ పుడుతుందని వారి తాజా అధ్యయనంలో తేలింది. కొంతమంది యువతీయువకుల బృందంపై తాము అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. కొందరి ఫొటోలను ఈ బృందానికి చూపించామని, మొదటి రెండు మూడుసార్ల కంటే నాలుగోసారి అదే ఫొటోను చూపినపుడు వారిలో ఇష్టం పెరిగినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అదే ఫొటోను ముందుగా చూపినపుడు అంత ఇష్టం కనపెడలేదని హామిల్టన్ సైకాలజిస్ట్ తిరుచ్సెల్వం తెలిపారు. -
ఆ వయసులో ఫస్ట్ సైట్ లవ్వా?
మీరు తొలి చూపులోనే ప్రేమలో పడాలనుకుంటున్నారా. అయితే మీకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదేం మెలిక అంటారా. యువత కంటే మధ్య వయస్కులే ముందు చూపులోనే లవ్ లో పడిపోతారని అమెరికా అధ్యయనవేత్తలు అంటున్నారు. ఏదో ఆషామాషీగా వారి విషయం చెప్పడం లేదు. ఎంతో మంది అభిప్రాయాలు తీసుకుని దీన్ని రూడీ చేశారు. తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా అని అమెరికా డేటింగ్ వెబ్సైట్ డేటింగ్ఎడ్వైజ్ డాట్‌కామ్ సర్వే నిర్వహించింది. నిజమైన ప్రేమ తొలిచూపులోనే పుడుతుందని అత్యధికంగా 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరంతా 35 నుంచి 44 ఏళ్ల వయసున్న స్త్రీపురుషులు కావడం విశేషం. మహిళలు(53 శాతం) కంటే పురుషులు(63 శాతం) తొలిచూపు ప్రేమపై విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంధాల గాఢతను అంచనా వేయడంలో మధ్యవయస్కులకు అనుభవం ఉండడం కారణంగానే వారు 'ఫస్ట్ సైట్ లవ్'పై నమ్మకముంచుతున్నారని డేటింగ్ఎడ్వైజ్ డాట్‌కామ్ మహిళా డేటింగ్ ఎక్స్‌ఫర్ట్ రాచెల్ డాక్ పేర్కొన్నారు. ప్రేమ అంటే ఏమిటి అనే దానిపై 35 ఏళ్లలోపు వారికి స్పష్టత ఉంటుందని ఆమె విశ్లేషించారు. అయితే ప్రతి ఐదుగురిలో ఇద్దరు మాత్రం తొలిచూపు ప్రేమను కొట్టిపారేశారు. కాబట్టి 'ఫస్ట్ సైట్ లవ్'కు కాస్త ఆగాల్సిందే.