కంగనా రనౌత్
‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే ఉండదు. అదంతా పెద్ద ట్రాష్. ఈ ఆన్‌లైన్ ప్రేమలు ఎలా వర్కౌట్ అవుతాయో అస్సలు అర్థమే కాదు’’ అంటున్నారు కంగనా రనౌత్. ప్రేమలో తన అనుభవాల గురించి, ఆన్‌లైన్ ప్రేమల గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘లైఫ్‌లో ఏం జరిగినా అదంతా మన మంచికే జరిగిందని భావిస్తాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతిసారి అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడనుకుంటాను.. ‘దేవుడా! థ్యాంక్యూ నన్ను ఆ సంఘటన నుంచి కాపాడినందుకు’. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం కాదు.
మనది ప్రేమ లేఖలు రాసే జనరేషన్ కాదు.. యూ ట్యూబ్ జనరేషన్. కానీ ఒక మనిషి గురించి తెలియకుండా, అతన్ని కలవకుండా ఆన్‌లైన్‌లో ఎలా ప్రేమించుకుంటారు? మన లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ మీద కూడా ఇంటర్‌నెట్ ప్రభావం చూపించడం బాధగా ఉంది. మనందరం రోబోటిక్‌గా మారిపోయామేమో అనిపిస్తోంది. ఫ్యూచర్‌లో మనం కూడా మెకానికల్ అయిపోయి మెషిన్స్‌లా బిహేవ్ చేస్తామేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారామె. నిజమే.. కంగనా అన్నట్లు ఇంటర్‌నెట్ ప్రభావం ఈ జనరేషన్ మీద చాలా పడుతోంది. ఆన్ లైన్ ద్వారా మోసపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా ఇంటర్‌నెట్ ద్వారా ప్రేమలో పడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment