
నాలుగో చూపులో ప్రేమ
న్యూయార్క్: తొలిచూపులోనే ప్రేమ.. మాటను విన్నాం. కానీ ఇది కల్పిత భావన అని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, లవ్ ఎట్ ఫోర్త్ సైట్ నిజమని అంటున్నారు అమెరికాలోని హామిల్టన్‌కి చెందిన పరిశోధకులు. కనీసం నాలుగుసార్లు కలుసుకుంటేనే ప్రేమ పుడుతుందని వారి తాజా అధ్యయనంలో తేలింది. కొంతమంది యువతీయువకుల బృందంపై తాము అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. కొందరి ఫొటోలను ఈ బృందానికి చూపించామని, మొదటి రెండు మూడుసార్ల కంటే నాలుగోసారి అదే ఫొటోను చూపినపుడు వారిలో ఇష్టం పెరిగినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. అదే ఫొటోను ముందుగా చూపినపుడు అంత ఇష్టం కనపెడలేదని హామిల్టన్ సైకాలజిస్ట్ తిరుచ్‌సెల్వం తెలిపారు.