Luxury company manufacture
-
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
హైదరాబాద్‌లో రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ ప్లాంటు
- ఏర్పాటు చేస్తున్న ఫ్యాబ్ మోటార్స్ - రూ.1,000 కోట్ల పెట్టుబడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ బైక్‌ల తయారీలో ఉన్న అమెరికా కంపెనీ రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో అడుగు పెడుతోంది. సంస్థ భారతీయ భాగస్వామి అయిన ఫ్యాబులస్ అండ్ బియాండ్ మోటార్స్ ఇండియా (ఫ్యాబ్ మోటార్స్) హైదరాబాద్‌లో రూ.1,000 కోట్లతో అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. కొన్ని రోజుల్లో ప్లాంటు పనులు ప్రారంభం కానున్నాయి. షిఫ్ట్‌కు నెలకు 500 బైక్‌ల తయారీ సామర్థ్యంతో తొలి దశ ప్లాంటు ఏడాదిలో సిద్ధమవుతుందని ఫ్యాబ్ మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంజీ షారిఖ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆటో షో సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రీగల్ రాప్టార్ కూడా కొంత పెట్టుబడి పెడుతోందని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. తొలి షోరూం హైదరాబాద్‌లో.. యూఎస్ డిజైన్‌తో షాంఘైలో తయారైన రీగల్ రాప్టార్ బైక్‌లు ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో అమ్ముడవుతున్నాయి. భారత్‌లో తొలుత బాబర్, డేటోనా 350, డీడీ 350ఈ 9బీ వంటి మోడళ్లను విడుదల చేయనుంది. రీగల్ రాప్టార్ బ్రాండ్‌లో 320-1,800 సీసీ ఇంజన్ సామర్థ్యంగల బైక్‌లు ఉన్నాయి. ధర రూ.2.90-20 లక్షల మధ్య ఉంది. తొలి షోరూం హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో షోరూంలను తెరువనున్నారు. రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్, ఫ్యాబ్ మోటార్స్ మధ్య గతేడాది అక్టోబరులో ఒప్పందం కుదిరింది. భారత్‌లో తయారైన బైక్‌లను సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌తోపాటు పొరుగున ఉన్న దేశాలకు ఎగుమతి చేయనున్నారు. తొలుత విడిభాగాల రూపంలో(సీకేడీ) బైక్‌లను దిగుమతి చేస్తారు. రానున్న రోజుల్లో కొన్ని విడిభాగాలను దేశీయంగా తయారీ చేపడతారు.