M-cap
-
వారు చెప్పింది తప్పు అని నిరూపించాం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
రయ్‌మంటూ దూసుకెళ్లిన రిలయన్స్..! డీలా పడ్డ టీసీఎస్..!
గత వారం దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒకానొక సమయంలో భారీ లాభాలను గడిస్తూనే, అమెరికా ఫెడ్ రేట్లు, ద్రవ్యోల్భణం వంటి అంశాలతో స్టాక్‌మార్కెట్స్ తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) గత వారం 1,03,532.08 కోట్ల మేర క్షీణించింది. టాప్-10 మార్కెట్ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా నష్టపోయింది. వీటిలో కేవలం రిలయన్స్ మాత్రమే భారీగా లాభపడింది. 30 షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ గత వారం 491.90 పాయింట్లు, సుమారు 0.83 శాతం మేర క్షీణించింది. దీంతో టాప్-10 విలువైన కంపెనీల్లో కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మాత్రమే లాభపడింది, గత వారం రిలయన్స్ మార్కెట్ క్యాప్ గణనీయంగా పెరిగింది. ► రిలయన్స్ గ్రూప్స్ మార్కెట్-క్యాప్ రూ. 30,474.79 కోట్లు పెరిగి రూ.16,07,857.69 కోట్లకు చేరుకుంది. ► టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,037.2 కోట్లు తగ్గి రూ.13,67,021.43 కోట్ల వద్ద స్థిరపడింది. ► హెచ్డీఎఫ్సీ మార్కెట్-క్యాప్ రూ.13,772.72 కోట్లు తగ్గి రూ.4,39,459.25 కోట్లకు చేరుకుంది. ► హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.11,818.45 కోట్లు తగ్గి రూ.5,30,443.72 కోట్ల వద్ద స్థిరపడింది. ► ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.9,574.95 కోట్లు తగ్గి రూ.5,49,434.46 కోట్లకు చేరుకుంది. ► గత వారం బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,987.52 కోట్లు తగ్గి రూ.4,22,938.56 కోట్ల వద్ద స్థిరపడింది. ► ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,386.79 కోట్లు తగ్గి రూ.7,23,790.27 కోట్లకు చేరుకుంది. ► మొబైల్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,157.91 కోట్లు క్షీణించి రూ.3,92,377.89 కోట్ల వద్ద స్థిరపడింది. ► హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.2,993.33 కోట్లు తగ్గి రూ.8,41,929.20 కోట్లకు చేరుకుంది. ► ఇక ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్ రూ.803.21 కోట్లు తగ్గి రూ.4,72,379.69 కోట్ల వద్ద స్ధిరపడింది. చదవండి: గత ఏడాది హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..! -
టీసీఎస్ మళ్లీ టాప్కు
సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాప్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువలో రూ. 6 లక్షల కోట్ల రూపాయలను క్రాస్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత ఈ మైలురాయిని తాకిన రెండో కంపెనీగా నిలిచింది. ఉదయం ట్రేడింగ్‌లో టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) రూ. 6,12,696.46 కోట్లుగా నమోదైంది. అంతేకాదు కంపెనీ విలువలోరిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్ షేర్లు 4.88 శాతం పెరిగి రూ. 3,254 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. అయితే ఆర్ఐఎల్ షేర్ 1.89 శాతం నష్టపోయింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ 6,11,096.56 కోట్లుగా నిలిచింది. -
ఆల్ టైమ్ రికార్డులో మార్కెట్ విలువ!
ముంబై : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. గురువారం ఉదయం ట్రేడింగ్ లో మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎమ్-క్యాప్) రూ.107 లక్షల కోట్లకు ఎగబాకింది. 2015 ఏప్రిల్ లో 106.85లక్షల కోట్ల రికార్డును గురువారం నాటి ట్రేడింగ్ బద్దలు కొట్టింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ మొదటిసారి 2014 నవంబర్ లో రూ.100లక్షల కోట్ల రికార్డును ఛేదించింది. మార్కెట్ విలువలో ఆల్ టైమ్ రికార్డులను తాకుతూ ప్రపంచంలోని టాప్-10 ఎక్స్చేంజీలలో ఒకటిగా బీఎస్ఈ ఆవిర్భవించింది. మరోవైపు లిస్టయిన కంపెనీల సంఖ్యా రీత్యా కూడా టాప్ ర్యాంకులో కొనసాగుతుండటం విశేషం. బీఎస్ఈ-లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడిదారుల సంపదను మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కొలుస్తారు. ప్రస్తుతం 2,400కు పైగా కంపెనీలు బీఎస్ఈలో ట్రేడ్ అవుతున్నాయి. కొత్త కంపెనీల లిస్టింగ్ ల జోరు కొనసాగుతుండటంతో, బీఎస్ఈలో మార్కెట్ క్యాపిలైజేషన్ యేటికేటికి పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.11,799 కోట్లతో మొదటిసారి ఎల్&టీ ఇన్ఫోటెక్ నేడు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయింది. మార్కెట్ వాల్యుయేషన్ ఆల్ టైమ్ రికార్డు స్థాయికి తాకడంతో, బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 6.88 శాతం పెరిగి, 1,798.35 పాయింట్ల వద్ద తన ర్యాలీని కొనసాగిస్తోంది. ప్రస్తుతం రూ.4,90,538.04 కోట్ల వాల్యుయేషన్ తో టీసీఎస్ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా పేరొందుతోంది. టీసీఎస్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రూ.3,27,600.39 కోట్లు), హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు(రూ.3,11,811.40 కోట్లు), ఐటీసీ(రూ. 3,04,536.08 కోట్లు), ఇన్ఫోసిస్(రూ.2,47,656.57 కోట్లు)లు ఉన్నాయి.