సాక్షి, ముంబై: భారతీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో మైలురాయిని అధిగమించింది. మార్కెట్ క్యాప్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువలో రూ. 6 లక్షల కోట్ల రూపాయలను క్రాస్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత ఈ మైలురాయిని తాకిన రెండో కంపెనీగా నిలిచింది. ఉదయం ట్రేడింగ్‌లో టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం క్యాప్) రూ. 6,12,696.46 కోట్లుగా నమోదైంది. అంతేకాదు కంపెనీ విలువలోరిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కి నెట్టి దేశంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.
టీసీఎస్ షేర్లు 4.88 శాతం పెరిగి రూ. 3,254 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. అయితే ఆర్ఐఎల్ షేర్ 1.89 శాతం నష్టపోయింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ 6,11,096.56 కోట్లుగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment