M raghunandanaravu
-
రైతన్న కన్నెర్ర
దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1,606 మంది రైతులు తీసుకున్నరూ.9 కోట్లతో పాటు వడ్డీ రూ.2 కోట్లు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గురువారం దుబ్బాక ఎస్బీఐ ఎదుట దాదాపు గంట పాటు బైఠాయించి.. నిరసన తెలిపారు. దుబ్బాక : ‘రైతులకు రుణమాఫీ అన్నారు.. రైతు ప్రభుత్వమన్నారు.. పొద్దస్తమానం అన్నదాతల జపం చేసిండ్రు.. రైతుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వమే బ్యాంకు అధికారులతో రుణాలు చెల్లించాలని నోటీసులిప్పించడం చూస్తుంటే ఇదేమి ప్రభుత్వమో తెలియడం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు ఆరోపించారు. బ్యాంకు అధికారులు అందించిన నోటీసులతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆర్అండ్బీ నుంచి గురువారం దుబ్బాక ఎస్బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1606 మంది రైతులు రూ.9 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని, అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలన్నింటినీ దశల వారిగా మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. రూ.9 కోట్ల అసలు రుణంతో పాటు మిత్తి మరో రూ.2 కోట్లు ఇవ్వాలని సంబంధిత రైతులకు నోటీసులివ్వడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ వర్తించదా..? రూ.వేల కోట్లతో బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా బాబులను విడిచిపెట్టి కాయాకష్టం చేసుకుని జీవించే రైతులను బెదిరించడం బ్యాంకు అధికారులకు తగదన్నారు. నోటీసులందుకున్న రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నోటీసులందుకున్న రైతులకు ప్రభుత్వమిచ్చే రుణమాఫీ పథకం వర్తించదా అని రఘునందన్ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కావాలని దుబ్బాక బ్యాంకు నుంచి ముందుగా రైతులకు నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినోళ్లకే బ్యాంకు అధికారులు వ్యక్తిగత రుణాలు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలు మాఫీ అయ్యేంతవరకు బీజేపీ దశల వారీగా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్‌గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షులు తోట కమలాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విభీషన్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎన్ చారి, మండల అధ్యక్షుడు మంద అనిల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సత్తు తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్ మాటలన్నీ కాంగ్రెస్ మాటలే
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నోటి నుంచి వస్తున్న మాటలన్నీ కాంగ్రెస్ మాటల్లాగానే ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను కలసిన తర్వాత రేవంత్‌రెడ్డి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరగానే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే పగటి కలలను రేవంత్‌రెడ్డి కంటున్నారన్నారు. గతంలోనూ స్టార్ హోటళ్లలో పార్టీ మీటింగులు జరిగాయన్నారు. అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రేవంత్‌రెడ్డి వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ లేదనే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. -
అర్జీదారులకు న్యాయం చేయండి
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి జరి గింది. కలెక్టర్‌తో పాటు జేసీ ఉషాకుమారి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ తదితర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఆయాశాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, పరి ష్కరించిన వెంటనే అర్జీదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో డి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, డీఎంఅండ్‌హెచ్‌వో జె.సరసిజాక్షి, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, ఆర్వీఎం పీవో బి.పద్మావతి, డీపీవో కె.ఆనంద్, డీఎస్వో పి.బి.సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి, మత్స్యశాఖ డీడీ కల్యాణం, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే... డిసెంబర్ 31న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలోని చర్చి ఫాదర్ మోజెస్, ఆయన భార్య సువర్తామ్మపై కత్తులతో దాడిచేసి గాయపరిచిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టిషన్ కౌన్సిల్ సభ్యులు కె.డానియల్రాజు, కె.కృపావరం అర్జీ ఇచ్చారు. అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్కు డంపింగ్ యార్డుగా మారిందని, చెత్త తొలగించి పార్కును వినియోగంలోకి తేవాలని సామాజిక కార్యకర్త ఆది రామ్మోహనరావు అర్జీ సమర్పించారు. వీరులపాడు మండలం నరసింహారావుపాలెం గ్రామంలోని సర్వే నంబరు 164లో ఉన్న పల్లగుట్టలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుడు పి.కామేశ్వరరావు ఫిర్యాదుచేశారు. మచిలీపట్నం మునిసిపాల్టీలోని చెత్తను పట్టణంలోని జాతీయ కళాశాల సమీపంలో వేస్తున్నారని, దీని వల్ల కళాశాల విద్యార్థులు, ఎస్ఎన్ గొల్లపాలెం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఫిర్యాదుచేశారు. రుద్రవరం సమీపంలో సేకరించిన 50 ఎకరాల్లో కంపోస్ట్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష్మీపురం పంచాయతీ, రామానగరంలోని బీసీ బాలుర హాస్టల్‌ను మోపిదేవి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విలీనం చేసేందుకు జరుగుతున్న యత్నాలను విరమించాలని టీడీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు అందే జగదీష్ కోరారు. హాస్టల్‌ను విలీనం చేస్తే అందులో వసతి పొందుతున్న ఘంటసాల, చల్లపల్లి మండలాల బీసీ విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో బెల్టుషాపులు, సారా, మత్తు పదార్థాల విక్రయాలను నిషేధించేందుకు 2002 నుంచి పోరాడుతున్న గ్రామస్తులకు ఎక్సైజ్‌శాఖ అధికారులు సహకరించాలని కోరుతూ గ్రామానికి చెందిన తమ్ము ఏడుకొండలు అర్జీ సమర్పించారు.