సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నోటి నుంచి వస్తున్న మాటలన్నీ కాంగ్రెస్ మాటల్లాగానే ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను కలసిన తర్వాత రేవంత్‌రెడ్డి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లో చేరగానే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే పగటి కలలను రేవంత్‌రెడ్డి కంటున్నారన్నారు. గతంలోనూ స్టార్ హోటళ్లలో పార్టీ మీటింగులు జరిగాయన్నారు. అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రేవంత్‌రెడ్డి వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ లేదనే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment