తెలుగువర్శిటీ ఎంఎ దూరవిద్య పరీక్షలు వాయిదా
శ్రీశైలం : పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 3 వ తేదీ నుంచి నిర్వహించే ఎంఎ దూర విద్య కోర్సుల వార్షిక పరీక్షలు వాయిదా వేసినట్లు శ్రీశైలం పీఠం పీఠాధిపతి పి.అప్పారావు మంగళవారం తెలిపారు. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కూచిపూడి ప్రాంగణాలలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేశామని, ఈ వార్షిక పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారని తెలుగువర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య తెలిపినట్లు శ్రీశైలం పీఠాధిపతి పేర్కొన్నారు.