machak river
-
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం
-
మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
‘300 మందికి పైగా కాపాడాం’
మధ్యప్రదేశ్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులను కాపాడినట్లు రైల్వే, సహాయ అధికారులు చెబుతున్నారు. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న పలువురిని స్థానికులు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది కాపాడారన్నారు. కాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు బాగా ప్రభావితమయ్యాయి. ముంబై నుంచి బయల్దేరే దాదాపు 25 రైళ్లను దారి మళ్లించారు. అలాగే పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు. కొన్ని రైళ్లను రాజస్థాన్ - కోట మార్గంలోకి మళ్లించే అవకాశం కనిపిస్తోంది. -
రైలు ప్రమాదంలో 30 మంది మృతి
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం పలువురు కొట్టుకుపోతుండగా చూశామన్న సాక్షులు హర్దా: మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే. మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో పలువురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలామంది నీళ్లలో కొట్టుకుపోతుండటం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు.