Maddikunta
-
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్‌తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్‌తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి -
‘అన్నల’ ఊరు.. మారెను చూడు
కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో మారుమూలన ఉన్న ‘మద్దికుంట’ చరిత్ర ఇది. ఈ గ్రామాన్ని అప్పటి పీపుల్స్‌వార్ నాయకత్వం విముక్తి గ్రామంగా ప్రకటించుకుని తమ మార్కు అభివృద్ధి నమూనాను అమలు చేసింది. పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారిన తరువాత కూడా రాష్ట్ర కమిటీతోపాటు, కేంద్ర కమిటీ నేతలు సైతం మద్దికుంటలో రోజుల తరబడి మకాం వేసేవారు. అంతర్జాతీయ విప్లవ సంస్థల ప్రతినిధులు సైతం మద్దికుంటకు వచ్చేవారు. ఆ ఊరి ప్రజలు కూడా అందరిదీ ఒకే మాట, ఒకే బాటగా నడుచుకుంటూ ముం దుకు సాగారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. 2005 తరువాత మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం తో మద్దికుంట అన్ని గ్రామాలలాగే రాజకీయ కార్యకలాపాలకు వేదికైంది. అక్కడ అన్ని పార్టీలకు చెందిన వాళ్లు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రూపు ాజకీయాలకు ఆ గ్రామం ఇప్పుడు నిలయంగా మారడం ఆందోళన కలిగి స్తోంది. ‘‘అన్నలున్నపుడే మా ఊరు మంచిగుండె. ఇప్పుడు తాగుడుకు బాగా అలవాటు పడి ఒకనిమీద ఒకరు లొల్లులకు దిగున్నరు’’ అంటూ గ్రామానికి చెందిన 70 వృద్ధుడొకరు గతాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు దశాబ్దాలు అన్నల చేతులలో 1982 ప్రాంతంలో అప్పటి పీపుల్స్‌వార్ నేత శీలం నరేశ్ అలియాస్ జగన్ నేతృత్వంలో నక్సల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అటవీ అధికారు ల వేధింపులు,పెత్తందారుల ఆగడాలకు అడ్డుపడింది. అప్పటి నుంచి మద్దికుంట ప్రజలు నక్సల్స్‌కు కొం త అనుకూలంగా మారారు. అప్పు డు వారు ప్రజల పాలన ఎలా ఉం టుందోనన్న విషయాన్ని అర్థం చేయించారు. ఆ రోజు మొదలైన అన్నల పాలన రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో మావోయిస్టు నేతలు ఆ గ్రామంతో సంబంధాలు నెరిపారు. వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగా యి. నక్సలైట్లకు సహకరిస్తున్నారంటూ పోలీసులు గ్రామంపై వందల పర్యాయాలు విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్టు చితకబాదేవారు. వివిధ కేసులలో 250 మందికి పైగా అరెస్టయ్యారు. ఇంటికొకరు ఏదోరకంగా ఇబ్బందిపడ్డవారే. ఒకసారి ఓ మిలిటెంట్‌ను పోలీసులు పట్టుకెళుతుంటే గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్న సందర్భంలో 72 మందిపై కేసులు నమోదయ్యాయి. మరో సందర్భంలో 91 మందిపై కేసులు పెట్టారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో అమలు చేయడం మొదలైంది. మొదట్లో విద్యాభివృద్ధికి కృషి జరిగింది. పాఠశాలకు స్థలం లేకపోవడంతో గ్రామస్థుల సహకారంతో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదనపు గదులు నిర్మించడానికి ప్రజలు శ్రమదానం చేశారు. అన్నల హవా కొనసాగిన కాలంలోనే గ్రామంలో పదో తరగతి వరకు పాఠశాల అప్‌గ్రేడ్ జరిగింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండడంతో విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు. సబ్‌స్టేషన్ కోసం శ్రమదానం లోవోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే వారు. విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం మద్దికుంట, రెడ్డిపేట గ్రామాల ప్రజలు అప్పటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ద్వారా అప్ప టి సీఎం ఎన్టీఆర్‌ను కలిశారు. తాము శ్ర మదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని విన్నవించుకున్నారు. దీంతో ప్రభుత్వం సబ్‌స్టేషన్ మంజూరు చేసింది. స్తంభాలకు గుంతలు తీయడం, లాగడం, స్తంభాలను తరలించడం వంటి పనులన్నీ ప్రజలు శ్రమదానంతో చేపట్టారు. దీంతో ఆ గ్రామంలో లోఓల్టేజీ సమస్య తీరింది. గ్రామంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పశువులకు నీటితొట్టెలు నిర్మించారు. పంట పొలాలకు వెళ్లడానికి రోడ్డు వేయించారు. రైతుల కోసం సొసైటీ ఏర్పాటు మద్దికుంటలో అధిక శాతం రైతులు పేద, మద్య తరగతివారే. వ్యవసాయానికి పెట్టుబడులు కూడా దొరకని పరిస్థితులు ఎదుర్కొనేవారు. అప్పుడు పీపుల్స్‌వార్ నాయకత్వం గ్రామంలో ఓ సొసైటీని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసింది. పంట చేతికొచ్చిన తరువాతనే డబ్బులు చెల్లించేలా చూసేవారు. తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగింది. ప్రతీ సీజన్లో గ్రామానికి ఆరు లారీల ఎరువులు తీసుకువచ్చేవారని గ్రామస్థులు తెలిపారు. ప్రతీ రైతుకూ నాలుగు, ఐదు బస్తాల ఎరువు అందేదన్నారు. ఎరువుల కోసం కామారెడ్డికి వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితులు లేకుండా ఇంటిదగ్గరే దొరికేవని పేర్కొన్నారు. గ్రామంలో పేద రైతులకు సాగునీటి వసతి కల్పించేందుకుగాను నలుగురైదుగురికి కలిపి ఒక బోరు వేయించి మోటార్ బిగించి ఆదుకున్నా రు. ఇలా గ్రామంలో నాలుగైదు బోర్లు తవ్వించడం ద్వారా 20 మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. ఎన్నికల బహిష్కరణలో రికార్డు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగినపుడల్లా నక్సల్స్ పిలుపు మేరకు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించేవారు. పోలీసులు గ్రామానికి వెళ్లి ప్రజలపై ఒత్తిడి తెచ్చే వారు. ఎన్నికలకు ముందు రోజే గ్రామస్తులు పొలాల వద్దకు పరుగులు తీసేవారు. కొన్ని సందర్భాలలో పోలీసులు బలవంతంగా ఓట్లేయించేవారు. 2006 వరకు ఏకగ్రీ వంగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలను ఎన్నుకునేవారు.