Maddy
-
రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్మేశాడా?
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్. హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్ స్పందించాడు.. 'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ. Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert — Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022 చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ తీసే ధ్యైర్యం చేస్తారా? -
అల’జడి
సాక్షి, చెన్నై : పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్ల రూపంలో రాష్ట్రానికి మోస్తారుగా వర్షాలు కురిశారుు. ప్రస్తుతం మరో తుపాను రూపంలో కొంత మేరకు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో నైరుతీ దిశలో ఇటీవల అల్పపీడన ద్రోణి బయలు దేరింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో విడతలు వారీగా వర్షాలు పడుతున్నాయి. నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్ని మాత్రం వర్షం ముంచెత్తింది. చెన్నైకు ఆగ్నేయంలో 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి బలపడింది. శుక్రవారం అర్ధరాత్రి మరింత బలపడిన ఈ ద్రోణి తుపానుగా మారింది. దీనికి మ్యాడీ అని నామకరణం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రాని ముప్పు లేదు: ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి ముప్పు లేదని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మాల్దీవుల వైపుగా ఈ తుపాన్ తీరం దాటనున్నది. ఈ నెల పదో తేదీ లేదా 11న తీరం దాటొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో కాశి మేడు, ఎన్నూరు, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. యువత ఆ కెరటాల మధ్యలో కేరింతలు కొడుతోంది. కెరటాల తాకిడి క్రమంగా పెరగడంతో జాలర్లు చేపల వేటకు దూరమయ్యారు. నడి సముద్రంలోకి వెళ్లొద్దన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో మర పడవలు, మోటార్ బోట్ల పడవలు కలగిన జాలర్లు కడలిలోకి వెళ్లేందుకు సాహసించడం లేదు. చెన్నైలో మూడు వేల మంది జాలర్లు శనివారం చేపల వేటకు వెళ్లలేదు. వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇచ్చే సమాచారం మేరకు కడలిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. గాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో సముద్ర తీరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.