MADUGULA constituency
-
చీడికాడలో రోడ్‌షోలో వైఎస్ విజయమ్మ
-
రూ. కోటి ఇస్తే చనిపోతావా బాబూ అన్నారు : వైఎస్ విజయమ్మ
సాక్షి, విశాఖపట్నం : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలు, రైతుల శ్రేయస్సు గురించి తపన పడేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చీడికాడలో రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రైతుల ప్రాణాలంటే చంద్రబాబుకు ఎన్నడూ లెక్కలేదని విమర్శించారు. గతంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ‘1978లో వైఎస్సార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం అయ్యారు. అంతకాలం ఆయన ఏ పదవిలో లేరు. అయినా, రైతుల సమస్యలపై పోరాడారు. అప్పుల బాధతో వేలాది మంది రైతులు చనిపోతుంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్సార్ నాడు సీఎంగా ఉన్న చంద్రబాబును నిలదీశారు. రైతులకు లక్ష రూపాయల చొప్పన రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ, వారికి రుణాలు మాఫీ చేస్తే అదే అలవాటవుంతుందని, లక్ష రూపాయలు మాఫీ చేస్తే మరింతమంది ఆత్మహత్య చేసుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాబు వ్యాఖ్యలపై సీరియస్ అయిన వైఎస్సార్.. కోటి రూపాయలిస్తా నువ్ చనిపోతావా బాబూ అని కౌంటర్ వేశారు. రైతుల ప్రాణాల విలువ అర్థం కావడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం అయిన తర్వాత తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై చేశారు. విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఆ మహానేత ఎప్పుడూ రైతురాజుగా మారాలని ఆలోచించేవారు’ అని ప్రసంగం కొనసాగించారు. విజయమ్మ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఆయనకు బ్లూప్రింట్ ఉండేదేమో.. ‘విశాఖ జిల్లాను వైఎస్సార్ ఎన్నోసార్లు సందర్శించారు. ఇక్కడి ప్రజలను పేరుపెట్టి పిలిచేంత చనువు ఉండేది. అందుకే ప్రజలు, రైతుల సమస్యలేంటి.. వారికి ఏయే సంక్షేమ ఫలాలు అందాలి అనే విషయం వైఎస్సార్‌కు బ్లూప్రింట్‌లా ఉండేది కావచ్చు. మీ అందరి శ్రేయస్సును కోరుతూ.. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉత్తరాంధ్రలో జంఝావతి, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, మిగిలిపోయిన పనులను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ అయిదేళ్లలో చంద్రబాబు వాటిని నిర్లక్ష్యం చేశారు. గత ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయొద్దు. ఇవి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు. చంద్రబాబు అయిదేళ్ల అరాచక పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సత్యవతిని, మాడుగుల ఎమ్మెల్యే అభర్థిగా ముత్యాల నాయుడుని గెలిపించాలి’ అని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్న జనసేన.. తమ్ముడు టీడీపీ!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్న జనసేన నుంచి, తమ్ముడు టీడీపీ నుంచి బరిలో నిలువడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జి రామానాయుడును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రామానాయుడు తమ్ముడు సన్యాసినాయుడుకు జనసేన టికెట్ కేటాయించింది. ఈ పరిణామాలపై జనసేనలోని కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు అల్లు భానుమతి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ టై అప్ అని.. జనసేనలో టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందుగానీ, తరువాత గానీ ఇద్దరు అభ్యర్థులు కలిసిపోతారని అన్నారు. ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జనసేన నిర్ణయం తీవ్ర క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పలు నియోజకర్గాల్లో టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు గమనిస్తే ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే విషయం అర్ధమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని జనసేన పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించడం టీడీపీ, జనసేనల మధ్య మైత్రికి నిదర్శనమని వారు చెబుతున్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం
మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన స్వగ్రామం తారువాలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని నాలుగుసార్లు అసెంబ్లీలో డిమాండ్ చేశానన్నారు. రైవాడ జలాశయం నీరు రైతులకు అంకితం చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ నుంచి రైవాడ జలాశయంకు రావాల్సిన రూ.110 కోట్లు విడుదల రైవాడ ఆధునికీకరణ చేపట్టాలని డిమాండ్ చేశానని వివరించారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు నష్టపరిహారం అందకపోవడాన్ని అసెంబ్లీలో లేవనెత్తి పోరాటం చేశానన్నారు. నియోజకవర్గంలో అసంపూర్తి జలాశయాలను పూర్తి చేసి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రులను నిత్యం సందర్శిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేసినట్టు చెప్పారు. పార్టీలో సముచిత స్థానంపై ఆనందం: ఎమ్మెల్యేగా మొదటి సారిగా ఎన్నికైనప్పటికీ వైఎస్సార్సీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా ఎంపికచేసి పార్టీలో సముచిత స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల అసెంబ్లీలో అదనంగా మాట్లాడే అవకాశం లభించిందన్నారు. డిప్యూటీ ప్లోర్ లీడర్‌గా ఎంపిక చేసిన పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. గత ఎమ్మెల్యే మాదిరిగా కాకుండా నిత్యం స్వగ్రామం తారువాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తున్నట్టు బూడి తెలిపారు.