కృష్ణపట్నం పోర్టుతో మెర్క్ లైన్ ఇండియా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒమన్లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేం దుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి వీక్లీ సర్వీసులు ప్రారంభమవుతాయని కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల కస్టమర్లను నేరుగా ఒమన్ ప్రాంత కస్టమర్లకు అనుసంధానించేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు.