OTT: ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ మూవీ రివ్యూ
అద్భుతమైన ఒక ఫాంటసీ సినిమా చూస్తారా? దాని పేరు ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’. యానిమేటెడ్ ఫిల్మ్. ఈ కథ పీటర్ అనే ఓ అనాథది. పీటర్ చిన్నప్పుడే తన ఫ్యామిలీతో పాటు తను ఎంతగానో ఇష్టపడే చెల్లెలిని కోల్పోతాడు. అప్పటి నుండి పీటర్‌ను ఓ మాజీ సైనికుడు పెంచుతూ ఉంటాడు. అనకోకుండా పీటర్ ఓ మహిళా మెజీషియన్‌ను కలుస్తాడు. ఆ మెజీషియన్ పీటర్ చెల్లెలు బతికే వుందని, కాకపోతే ఓ ఎలిఫెంట్ ద్వారా పీటర్‌కు ఆ చెల్లెలు దొరుకుతుందని చెబుతుంది.పీటర్ ఉండేది బాల్టీసి రాజ్యంలో. ఆ రాజ్యంలో ఇప్పటి దాకా తను ఏ ఎలిఫెంట్‌ను చూడలేదు, ఇప్పుడెలాగబ్బా అని అనుకుంటుంటే మేజిక్ షోలో పీటర్‌కు ఓ ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఆ ఎలిఫెంట్‌ను తనతో తీసుకువెళదామనుకుంటే ఆ దేశపు తిక్కరాజు పీటర్‌కు మూడు కఠినమైన టాస్కులు పెడతాడు. వాటిలో పీటర్ నెగ్గితే ఎలిఫెంట్‌ను తీసుకువెళ్ళవచ్చని కండిషన్ పెడతాడు. రాజు పెట్టిన ఆ మూడు కండిషన్లు ఏమిటి, పీటర్ ఎలిఫెంట్‌ను గెలుచుకుంటాడా లేదా, పీటర్ చివరికి తన చెల్లెలిని కలుసుకుంటాడా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా ఉన్న ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’ను చూడాల్సిందే. వెండీ రాజర్స్ అనే దర్శకుడు తీసిన ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ముఖ్యంగా రాజు ఇచ్చిన టాస్కులు కాని, ఎలిఫెంట్ చేసే ఫీట్లుగాని సూపర్‌గా వుంటాయి. సో దిస్ వీకెండ్ పిల్లలకు, పెద్దలకు కాదు కాదు మొత్తం ఫ్యామిలీకి సూపర్ ఛాయిస్ ‘ది మెజీషియన్స్ ఎలిఫెంట్’.– ఇంటూరు హరికృష్ణ