Mahindra Showroom
-
మహీంద్రా షోరూంలో చోరీ
నిజామాబాద్: మండలంలోని బర్ధిపూర్ శివారులోని మహీంద్ర షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ చోరీ వివరాలు సీఐ కె.కృష్ణ తెలిపిన ప్రకారం.. అందరూ దీపావళి వేడుకల్లో ఉండగా ఆదివారం అర్ధరాత్రి ముఖాలకు మాస్కులు ధరించిన నలుగురు దొంగలు షోరూం వెనుకవైపు కిటీకి తొలగించి లోపలికి ప్రవేశించారు. షోరూంలోని అన్ని గదులు తిరిగి కౌంటర్‌లోఉన్న రూ.82వేలు, ఒక ట్యాబ్, సెల్‌ఫోన్ దొంగిలించారు. అనంతరం నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. అయితే లాకర్ వంద కేజీల బరువు ఉండటంతో దానిని దూరంగా తీసుకెళ్లలేకపోయారు. షోరూం వెనుక ఉన్న చెత్తకుప్ప కింద దాచిపెట్టి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గమనించిన సెక్యూరీటీ సిబ్బంది షోరూం మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు తెలిపారు. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ సిబ్బందితో షోరూంను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. శనివారం రాత్రి క్యాషియర్ దినేశ్ రూ.4లక్షల 80 వేల నగదును లాకర్లో భద్రపరిచి వెళ్లాడని ఆ లాకర్‌తోపాటు చిన్న లాకర్లో దాచిన రూ.82వేలు చోరీకి గురైనట్లు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సీసీటీవీ పుటేజీలు పరిశీలించగా లాకర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు కొద్ది సేపటికి ఖాళీ చేతులతో రోడ్డుపైకి రావడాన్ని గమనించారు. దీంతో షోరూం వెనుక ఉన్న ప్రతిఅంగుళాన్ని పరిశీలించారు. సీఐ కృష్ణ ట్రాక్టర్‌ను తెప్పించి చెత్త కుప్పను తొలగించడంతో దానికింద ఉంచిన లాకర్ బయటపడింది. అందులోని డబ్బును పోలీసుల సమక్షంలో లెక్కించగా రూ.4.80 లక్షల నగదు అలాగే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం ఏసీపీ కిరణ్‌కుమార్ షోరూంను సందర్శించి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Respond On Farmer Issue: కర్ణాటక తుమకూరు మహీంద్రా షోరూంలో జరిగిన ఘటన సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బొలెరో కొనడానికి వెళ్లిన ఓ రైతు, అతని స్నేహితుల్ని.. వేషధారణ చూసి సేల్స్‌మ్యాన్ ఘోరంగా అవమానించాడు. ప్రతీకారంగా గంటలో పది లక్షలతో అక్కడ వాలిపోయిన రైతు.. షోరూం నిర్వాహకుల గర్వం అణచిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో చాలాసేపు వాగ్వాదం తర్వాత ఆఖరికి రైతు కెంపగౌడకి, అతని స్నేహితులకు క్షమాపణలు తెలియజేశాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన షోరూంలో జరిగిన ఘటనపై స్పందించలేదేం అనే అనుమానం చాలామందికి తలెత్తింది ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కూడా స్పందించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం ప్రాముఖ్యత గురించి ఒక ట్వీట్ చేశారు. @MahindraRise యొక్క ప్రధాన ఉద్దేశ్యం కమ్యూనిటీలు, అన్ని వాటాదారుల్ని అభివృద్ధి చేయడం. ఒక కీలకమైన ప్రధాన విలువ.. ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. ఈ తత్వశాస్త్రం నుండి ఏదైనా ఉల్లంఘన జరిగితే చాలా అత్యవసరంగా పరిష్కరించబడుతుంది అంటూ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు ఆయన. The Core Purpose of @MahindraRise is to enable our communities & all stakeholders to Rise.And a key Core Value is to uphold the Dignity of the Individual. Any aberration from this philosophy will be addressed with great urgency. https://t.co/m3jeCNlV3w — anand mahindra (@anandmahindra) January 25, 2022 అంతకు ముందు గిరిసొన్నాసెరీ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి రైతుకు జరిగిన అవమానం గురించి ఓ వార్త కథనాన్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా.. దానికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో విజయ్ నక్రా స్పందించారు. కస్టమర్ సెంట్రిక్ అనుభవాన్ని అందించడంలో డీలర్లు అంతర్భాగం. మా కస్టమర్లందరినీ మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. మేము సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. తగిన చర్య తీసుకుంటాం అని విజయ్ నక్రా రీట్వీట్ చేయగా.. ఆ రీట్వీట్‌కు రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహీంద్రా. Dealers are an integral part of delivering a customer centric experience & we ensure the respect & dignity of all our customers. We are investigating the incident & will take appropriate action, in the case of any transgression, including counselling & training of frontline staff https://t.co/9jLUptoevy — Veejay Nakra (@vijaynakra) January 25, 2022 A farmer was insulted for his looks by @MahindraRise showroom and he returned with full cash to buy the truck. @anandmahindra sir, please look into it. If true, I know this is not something that you would ever encourage! https://t.co/C9hXDXtIGM — GiriSonnaSeri Tech (@GiriSonnaSeri) January 24, 2022 Mahindra Car showroom salesman taunted a farmer aftr seeing his attire when he visited showroom to buy Bolero Pik-up. Farmer Kempegowda alleged field officer of showroom made fun of farmer & his attire, told him tat car is not worth 10 rupees for him to buy. @anandmahindra pic.twitter.com/9fXbc5naY7 — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) January 23, 2022 సంబంధిత వార్త: ఘోర అవమానం.. రైతు అల్టిమేట్ రివెంజ్ -
రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది!
Karnataka Farmer Was Humiliated At Mahindra Car Showroomఒక మనిషి ఆహార్యాన్ని బట్టి లేదా వేషధారణ చూసో తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడటమే కాక అవమానించాలనుకుంటారు. నిజానికి ఆ విధంగా చేస్తున్న వాళ్లే అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్‌లోని సేల్స్‌మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్‌మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపె గౌడని చాలా అవమానించి మాట్లాడాడు. Karnataka farmer's sweet revenge on the Mahindra showroom: దీంతో ఆ సేల్స్‌మేన్‌కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి" అని సేల్స్‌మేన్‌కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్‌మేన్‌కి చూపించాడు. దీంతో సేల్స్‌మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్‌మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా. దీంతో రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్‌మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు. (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
మహీంద్ర షోరూంలో చోరీ
అనంతపురం: అనంతపురం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రుద్రంపేట సమీపంలోని మహీంద్ర షోరూంలో దొంగలు దాదాపు రూ. 15 లక్షలు అపహరించుకుని పోయారు. అయితే వారి ప్రయత్నాన్ని షోరూం భద్రత సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దొంగలు భద్రత సిబ్బందిపై దాడి చేసి పరారైయ్యారు. దాంతో భద్రత సిబ్బంది పోలీసులుకు ఫిర్యాదు చేసి... షోరూమ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, యాజమాన్యం సంఘటన స్థలానికి చేరుకుని చోరీ వివరాలను భద్రత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా దొంగల దాడిలో భద్రత సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.