maid abuse
-
కొడుకే కన్నతల్లి కర్కశాన్ని బయటపెట్టాడు
రాంచీ: బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్ర.. తన ఇంట్లో పని చేసిన ఓ గిరిజన మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల పాటు ఆమె ఇంట్లో పని చేసిన సునీత.. వర్ణణాతీతమైన టార్చర్ చవిచూసింది. అయితే ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. సీమ కొడుకుపై ప్రశంసలు కురుస్తున్నాయి. సునీతపై జరిగిన దారుణం వెలుగులోకి రావడానికి కారణం.. సీమ కుమారుడేనని తెలుస్తోంది. తన కళ్లెదుట పని మనిషిని కన్నతల్లి చిత్రహింసలకు గురి చేయడాన్ని తట్టుకోలేక సీమ కొడుకు ఆయుష్మాన్ బయటపెట్టాడని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి అయిన వివేక్ ఆనంద్ బాస్కీ అనే స్నేహితుడిని ఈ విషయంలో ఆయుష్మాన్ సాయం కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వివేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కర్కశాన్ని వెలుగులోకి తెచ్చారన్నది ఆ కథనం సారాంశం. ‘ఈరోజు తాను బతికి ఉండడానికి ఆయుష్మానే కారణమ’ని సునీత కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. తన బాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు కొడుకును సైతం సీమా పాత్ర వదిలిపెట్టలేదు. కొడుకు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ.. అతన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. సునీతకు సాయం చేసే ప్రయత్నం తెలియడంతో కొడుకు ఆయష్మాన్ను రాంచీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైక్రియాట్రీ అండ్ అలైడ్ సైన్సెస్‌లో చేర్పించినట్లు సమాచారం. ఆయుష్మాన్ అక్కడి సెక్రటేరియెట్‌లో పని చేస్తున్నారు. WATCH | BJP Leader & Wife Of Ex-IAS Officer #SeemaPatra Arrested In Ranchi For Allegedly Torturing Domestic Help For Years ▪️Victim | "She broke my teeth with iron rod, was made to lick urine off the floor, was not given food for days" 1/2#CrimeHasNoGender #SeemaPatraArrested pic.twitter.com/gze48EjzJr — Voice For Men India (@voiceformenind) August 31, 2022 మంగళవారం సునీత తనపై సీమా పాత్ర ఎలాంటి వేధింపులకు పాల్పడిందో చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇనుప రాడ్లతో పళ్లు రాలగొట్టి.. మూత్రాన్ని నేల మీద వేసి నాకించిందని, పని చేసే టైంలో తప్పులు చేస్తే కొట్టడంతో పాటు వాతలు పెట్టేదని సునీత అతికష్టం మీద వెల్లడించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ భార్య, బీజేపీ మహిళా విభాగం నేత అయిన సీమా పాత్ర.. ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. అయితే రాంచీ నుంచిపారిపోతున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి.. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల కస్టడీ విధించింది. ఇదీ చదవండి: సీమా పాత్ర వేధింపుల ఘటన.. కేటీఆర్ స్పందన -
సునీత చదువుకు సాయం అందిస్తా: కేటీఆర్
హైదరాబాద్: తన ఇంట్లో పని చేసే మహిళను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతంలో జార్ఖండ్ బీజేపీ సస్పెండెడ్ నేత సీమా పాత్రా అరెస్ట్ అయ్యింది. బాధితురాలు సునీతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడం, అందులో ఆమె సీమ చేతిలో ఎంత దారుణంగా హింసించబడిందో వివరించడంతో దుమారం రేగింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కోలుకుంటే.. తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన వీడియో ఒక దానిని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ పోస్ట్ చేశారు. ‘‘ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెబుతోంది’’ అంటూ దత్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి ట్విటర్లో స్పందించారు కేటీఆర్. తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్‌ను కోరారాయన. కేటీఆర్ బదులును అభినందించిన దత్.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు. Barkha, I would be happy to contribute in my personal capacity to the young girl’s education Please send me her family’s details https://t.co/bZ3VLO5EmF — KTR (@KTRTRS) August 31, 2022 రాంచీ అశోక్ నగర్‌లోని తన లగ్జరీ ఇంటి పనుల కోసం గిరిజన మహిళ సునీతను ఎనిమిదేళ్ల కిందట తెచ్చుకుని.. దారుణంగా హింసించింది సీమా పాత్ర. ఈ ఉదంతం సంచలనం సృష్టించగా.. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పారిపోతున్న సీమను వెంబడించి అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది కూడా. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీమపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీని ఆదేశించింది. ఇదీ చదవండి: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు -
క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో పనిచేసే అమ్మాయిని చితకబాదినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహదత్, ఆయన భార్య నృట్టో షహదత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఢాకాలోని ఓ వీధిలో 11 ఏళ్ల బాలిక గాయాలతో ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఆ అమ్మాయి కంటి దగ్గర, ఇతర చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారు. క్రికెటర్ షహదత్ ఇంట్లో పనిచేస్తున్నానని.. ఆయన, ఆయన భార్య తనను చిత్రహింసలు పెట్టారని చెప్పింది. పోలీసులు ఆ అమ్మాయిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు షహదత్, ఆయన భార్యపై కేసు నమోదు చేసి.. ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో షహదత్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ రోజు ఉదయం కూడా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.