క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట | Bangladesh cricketer faces arrest over alleged maid abuse | Sakshi
Sakshi News home page

క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట

Published Mon, Sep 7 2015 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట

క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో పనిచేసే అమ్మాయిని చితకబాదినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహదత్, ఆయన భార్య నృట్టో షహదత్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

ఆదివారం ఢాకాలోని ఓ వీధిలో 11 ఏళ్ల బాలిక గాయాలతో ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఆ అమ్మాయి కంటి దగ్గర, ఇతర చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారు. క్రికెటర్ షహదత్ ఇంట్లో పనిచేస్తున్నానని.. ఆయన, ఆయన భార్య తనను చిత్రహింసలు పెట్టారని చెప్పింది. పోలీసులు ఆ అమ్మాయిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు షహదత్, ఆయన భార్యపై కేసు నమోదు చేసి..  ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో షహదత్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ రోజు ఉదయం కూడా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement