దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్కు 14 ఏళ్ల జైలు | Bangladesh's Shahadat Hossain Faces 14-Year Jail Term For Assaulting Child Maid | Sakshi
Sakshi News home page

దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్కు 14 ఏళ్ల జైలు

Published Wed, Dec 30 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్కు 14 ఏళ్ల జైలు

దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్కు 14 ఏళ్ల జైలు

ఢాకా: ఇంట్లో పనిచేసే అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు  దోషులుగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడనుంది. షహదత్, ఆయన భార్య నృటో షహదత్పై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

షహదత్ దంపతులు తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల అమ్మాయిని హింసించినట్టు వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. షహదత్ దంపతులపై వచ్చిన ఆరోపణలు తమ ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలినట్టు పోలీసులు చెప్పారు. కాగా తాము ఎలాంటి తప్పూ చేయలేదని షహదత్ వాదిస్తున్నాడు. తన కెరీర్ను నాశనం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించాడు. అతనిపై ఆరోపణలు రాగానే అన్ని ఫార్మాట్ల నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. బంగ్లా తరపున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement