Shahadat Hossain
-
ఫీల్డ్‌లోనే సహచర ఆటగాడ్ని కొట్టిన క్రికెటర్
ఖుల్నా: క్రికెట్ మైదానంలోనే సహచర క్రికెటర్‌పై భౌతిక దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ క్రికెటర్ షహదాత్ హుస్సేన్‌పై ఏడాది నిషేధం పడింది. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్-ఖుల్నా డివిజన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్ దాడికి పాల్పడ్డాడ్డు. బంతిని ఒకవైపే షైన్ చేయొద్దంటూ సహచర ఆటగాడు ఆరాఫత్ సన్నీ చెప్పడంతో ఆగ్రహానికి గురైన షహదాత్ దాడికి దిగాడు. ఫీల్డ్‌లో అంతా చూస్తుండగానే ఎందుకు షైన్ చేయకూడదంటూ ఆరాఫత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చి కొట్లాటను అడ్డుకున్నారు. దీనిపై ఆరాఫత్ మాట్లాడుతూ.. బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదని షహదాత్‌కు చెప్పిన క్రమంలో అతను తనతో గొడవకు దిగాడన్నాడు. అదే సమయంలో తనను కొట్టాడని పేర్కొన్నాడు. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)సీరియస్ అయ్యింది. జట్టులోని సహచర ఆటగాడిగాపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లెవల్ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై 12 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ నుంచి షహదాత్ వైదొలిగాల్సి వచ్చింది. తాజా వివాదంపై షహదాత్ మాట్లాడుతూ.. ‘ నేను సస్పెండ్ అయిన కారణంగా ఎన్సీఎల్ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేను. నా సహనాన్ని కోల్పోయిన మాట వాస్తవం. కానీ అతను కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతన్ని చేయి చేసుకునే వరకూ వెళ్లాల్సి వచ్చింది. నేను బంతిని షైన్ చేస్తుంటే వద్దన్నాడు. ఎందుకు అని అడిగా. కానీ గట్టిగా అరుస్తూ నన్ను ఏదో అన్నాడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ క్రమంలోనే కొట్టాల్సి వచ్చింది’ అని తెలిపాడు. బంగ్లాదేశ్ తరఫున 38 టెస్టులు ఆడిన షహదాత్ 72 వికెట్లు తీశాడు.ఇక 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. 2015లో ఒకసారి షహదాత్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. భార్యను వేధించిన కేసులో షహదాత్ ఇరుక్కోవడంతో అతనిపై నిషేధం పడింది. ఆపై కొన్ని నెలలకు షహదాత్ అభ్యర్థన మేరకు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్ ఆడటానికి అనుమతి ఇచ్చింది. 2015లో బంగ్లాదేశ తరఫున షహదాత్ చివరిసారి ఆడాడు. -
వివాదస్పద క్రికెటర్ పై నిషేధం తొలగింపు
ఢాకా: క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై విధించిన నిషేధాన్ని బంగ్లాదేశ్ ఎత్తివేసింది. స్వదేశంలో మ్యాచ్ లు ఆడేందుకు అతడిని అనుమతించింది. క్రిమినల్ కేసు ఎదుర్కొన్న హుస్సేన్ పై గతేడాది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిషేధం విధించింది. తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను అతడు వేధించినట్టు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. ఈ వివాదం మీడియాలో హైలెట్ కావడంతో హుస్సేన్ తో పాటు అతడి భార్య న్రిట్టో షాదత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై బీసీబీ చర్య తీసుకుంది. తాను తప్పు చేయలేదని బుకాయించిన హుస్సేన్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. తాను తప్పు చేశానని, మన్నించాలని ఏప్రిల్ 28న బీసీబీని వేడుకున్నాడు. ఈ కేసులో నేరం రుజువయితే హుస్సేన్, అతడి భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే హుస్సేన్ తో బాధిత బాలిక కుటుంబంతో రాజీకి వచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలిక కుటుంబానికి హుస్సేన్ డబ్బు ముట్టజెప్పి, తనపై ఆరోపణలను ఉపసంహరించుకునేలా ఒప్పించాడని తెలిపాయి. -
దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్‌కు 14 ఏళ్ల జైలు
ఢాకా: ఇంట్లో పనిచేసే అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడనుంది. షహదత్, ఆయన భార్య నృటో షహదత్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు. షహదత్ దంపతులు తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల అమ్మాయిని హింసించినట్టు వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. షహదత్ దంపతులపై వచ్చిన ఆరోపణలు తమ ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలినట్టు పోలీసులు చెప్పారు. కాగా తాము ఎలాంటి తప్పూ చేయలేదని షహదత్ వాదిస్తున్నాడు. తన కెరీర్‌ను నాశనం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించాడు. అతనిపై ఆరోపణలు రాగానే అన్ని ఫార్మాట్ల నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. బంగ్లా తరపున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. -
బాలికను వేధించిన క్రికెటర్
ఢాకా: అతడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన బౌలర్. అతి తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని క్రికెట్లో హీరోగా మారాడు. అతను ఓ బాలికను అతి కిరాతకంగా హింసించాడని తెలిసి దేశం నివ్వెరపోయింది. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ గురించి. తమ ఇంట్లో పనిచేసిన 11 ఏళ్ల మహఫుజా అక్తర్ అనే బాలిక షాదత్ హుస్సేన్, అతని భార్య న్రిట్టో షాదత్ కలిసి తీవ్రంగా వేధించారు. ముద్దుగా హ్యాపీ అని పిలువబడే మహఫుజా అక్తర్‌ను క్రికెటర్ వేధించాడనే విషయం ఇప్పుడు బంగ్లాదేశ్‌లో సంచలనం రేపుతోంది. హ్యాపీది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆమెకు తెలియదు. హ్యాపీని సాకుతున్న అమ్మమ్మ క్రికెటర్ ఇంట్లో ఆమెను పనికి కుదిర్చింది. అయితే ఆ ఇంట్లో తనని నిత్యం కర్రలతో, వంటగదిలోని సామాన్లతో కొట్టేవారని హ్యాపీ తెలిపింది. దెబ్బలను భరించలేక ఎవరూ చూడని సమయంలో ఆ ఇంట్లో నుండి పారిపోయి వచ్చింది. ముఖంపై గాయాలతో కన్పించిన హ్యాపీని గమనించిన ఓ జర్నలిస్టు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిచాడు. ఈ ఉదంతం తెలిసి బంగ్లాదేశ్ బాలల హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. బాలిక పట్ల కర్కశంగా ప్రవర్తించిన క్రికెటర్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నరకకూపం నుండి బయటపడిన హ్యాపీ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. తాను బడికి వెళ్లి చదువుకుంటానని, కాలేజీకి వెళ్తానని, తరువాత సినిమాల్లో నటిస్తానని అమాయకంగా చెబుతున్న హ్యాపీ.. తనను పనిలో కుదిర్చిన అమ్మమ్మపై ఎలాంటి కోపం లేదని చెబుతోంది. తమ పేదరికమే తనను అలా పనికి పంపేలా చేసిందని అమ్మమ్మ తప్పేం లేదని తెలిపింది. -
జైలుపాలయిన క్రికెటర్
ఢాకా: తమ ఇంట్లో పని చేసిన బాలికను వేధించి, తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోర్టులో లొంగిపోయాడు. సోమవారం షహదత్ ఢాకా కోర్టులో హాజరయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని జైలుకు తరలించారు. ఇదే కేసులో షహదత్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. షహదాత్ భార్య పుట్టింట్లో పోలీసులు సోదాలు చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ కేసులో షహదత్ దంపతులు కొంతకాలంగా తప్పించుకుని తిరిగారు. భార్య అరెస్ట్ అయిన మరుసటి రోజే షహదత్ కోర్టులో లొంగిపోయాడు. ఇటీవలే షహదత్ హుస్సేన్ దంపతులు తమ ఇంట్లో పని చేస్తున్న బాలికను తీవ్రంగా కొట్టినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. బంగ్లా తరఫున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. -
క్రికెటర్ భార్య అరెస్ట్
ఢాకా: తమ ఇంట్లో పని చేసిన బాలికను వేధింపులకు గురిచేయడమే కాకుండా తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ షహాదత్ హుస్సేన్ భార్య న్రిట్టో హుస్సేన్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించి షహాదత్ , అతని భార్య తప్పించుకుని తిరుగుతున్నారని.. ఈ క్రమంలోనే షహదాత్ భార్య పుట్టింట్లో సోదాలు చేపట్టి ఆమెను అరెస్ట్ చేసినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. తన భార్య నిట్రోతో కలిసి హుస్సేన్ మామగారి ఇంట్లో తలదాచుకుంటున్నట్లు తమకు అందిన సమాచారం మేరకే సోదాలు చేపట్టామన్నారు. కాగా, అక్కడ షహదాత్ లేడని.. కేవలం అతని భార్య న్రిట్టో మాత్రమే ఉండటంతో ఆమెను అరెస్ట్ చేశామన్నారు. ఇటీవలే షహాదత్ హుస్సేన్ తన భార్యతో కలిసి తమ ఇంట్లో పని చేస్తున్న బాలికను తీవ్రంగా కొట్టినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి షహాదత్ భార్యను అరెస్టు చేశారు. కాగా, షహాదత్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బంగ్లా తరఫున షహాదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. అయితే షహాదత్ పై కేసు నమోదు కావడంతో అతన్ని బంగ్లా క్రికెట్ జట్టు నుంచి సస్పెండ్ చేశారు. -
క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో పనిచేసే అమ్మాయిని చితకబాదినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహదత్, ఆయన భార్య నృట్టో షహదత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఢాకాలోని ఓ వీధిలో 11 ఏళ్ల బాలిక గాయాలతో ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఆ అమ్మాయి కంటి దగ్గర, ఇతర చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారు. క్రికెటర్ షహదత్ ఇంట్లో పనిచేస్తున్నానని.. ఆయన, ఆయన భార్య తనను చిత్రహింసలు పెట్టారని చెప్పింది. పోలీసులు ఆ అమ్మాయిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు షహదత్, ఆయన భార్యపై కేసు నమోదు చేసి.. ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో షహదత్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ రోజు ఉదయం కూడా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు.