'అధికారమదంతో రాక్షసుడు అవుతున్నాడు'
అధికారమదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షసుడిగా మారాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇవ్వమని చెప్పినవారి జీవితాలను బుగ్గిపాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మల్కాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన చెరుకు తోటలను పరిశీలించి, రైతు గద్దె చంద్రశేఖర్ తదితరులను ఆయన సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..
శేఖరన్న చేసిన పొరపాటు ఏంటి..
ఆయన చేసిన తప్పంతా భూమిని ఇవ్వనని చెప్పడమే
అదేమైనా తప్పా అని అడుగుతున్నా
ప్రజాస్వామ్యంలో నా భూమి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది
బలవంతంగా తీసుకోవడం ఎంతవరకు ధర్మం
ఇవ్వకపోతే ఈ మాదిరిగా కాల్పించేయడం ఎంతవరకు న్యాయం
ఇది మొదటి సంఘటన కాదు, సంవత్సర కాలం నుంచి జరుగుతున్నాయి.
ఏ రైతు ఇవ్వనని అన్నారో, నా భూమి నా ఇష్టమని చెబుతున్నారరో.. వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంది.
గతంలో జరిగిన సంఘటనలో కూడా ఎక్కడా నిందితులను అరెస్టు చేయలేదు.
దగ్గరుండి చంద్రబాబు పురమాయిస్తున్నాడు, మంత్రులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు
చేసినవాళ్లు ఎవరో తెలిసినా కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. అసలు మొదట అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది చంద్రబాబునే
ఇదే మంత్రులు, చంద్రబాబుల భూముల్లోకి ఎవరైనా వచ్చి బలవంతంగా లాక్కుంటాం, ఇవ్వకపోతే తగలబెడతాం అంటే ఒప్పుకొంటారా
అలాంటప్పుడు.. ఒప్పుకోని రైతుల మీద.. శేఖరన్న లాంటి వ్యక్తుల మీద ఇలా చేయడం న్యాయమేనా?
మనుషులం.. రాక్షసులం అవుతున్నాం. చంద్రబాబు మానవత్వం అన్న గీత దాటి అధికారమదంతో రాక్షసుడు అయిపోయాడు
ఇలా దౌర్జన్యాలు చేయడం భావ్యం కాదు. ఇస్తామన్నవాళ్ల దగ్గర నుంచి తీసుకోండి
తగులబెట్టారని కాకుండా తగులబడింది అని కేసు పెట్టండి అన్నారట
డీఎస్పీ గారు సిగరెట్ పడి కాలిపోయిందని కేసు ఫైల్ చేయమన్నారట
ఫిర్యాదు చేసిన ప్రకారం పోలీసులు కేసులు పెట్టడం లేదు
బీహార్ లో జంగల్ రాజ్యంలాగా ఉంది.. ఆంధ్రప్రదేశ్
ఎవరైనా ఉంటే ఓసారి ఆంధ్రప్రదేశ్‌ను చూడండి బీహార్ ను మించిపోయినట్లుగా ఉంది.
పది నెలల్లో 13 ఘటనలు జరిగాయి
భూములు ఇవ్వని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
నిజంగా చంద్రబాబు భూములో మంత్రుల భూములో ఇలా చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది
చంద్రబాబు రాక్షసత్వం విడిచి మానవత్వంలోకి రావాలి.. మదం తగ్గించుకొని మనిషిలాగా మారాలి
బలవంతంగా లాక్కోవడాన్ని ఖండిస్తున్నాం
ఇప్పటికైనా మనసు మార్చుకుని రైతులకు అండగా ఉండకపోతే పరిస్థితులు చాలా సీరియస్‌గా ఉంటాయి
శేఖరన్నకు అన్నివిధాలా తోడుగా ఉంటాం. ఇలాంటి రైతులందరికీ కూడా అండగా ఉంటాం
కోర్టుల్లో కేసులు వేసి అయినా సరే బలవంతంగా భూములు లాక్కోవడాన్ని అడ్డుకుంటాం
ఇది ఎల్లకాలం జరగదు.. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు ఉంటుందో, మూడేళ్లు ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఉండదు
తర్వాత మనం వస్తాం, బలవంతంగా లాక్కున్న భూములన్నీ ఆయా రైతులకు మళ్లీ ఇప్పిస్తాం
అనంతరం రైతు గద్దె చంద్రశేఖర్ మాట్లాడారు. తన భూమిని ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వబోనని చెప్పడం వల్లే చెరుకుతోట తగలబెట్టారని, ఇది నూటికి నూరుశాతం వాస్తవమని ఆయన చెప్పారు. తాము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేశామని, కానీ తమకీ దౌర్భాగ్య స్థితి కల్పించారని వాపోయారు. ఇప్పుడు తమ చెప్పులతో తమనే కొట్టుకోవాలని అనిపిస్తోందన్నారు.