ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మండల సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ఏసీబీ) చిక్కాడు. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.