Mandap
-
పెళ్లి సమయంలో పెళ్లికి నిరాకరించిన వధువు.. కుప్పకూలిన వరుడు
-
పెళ్లి ఆపింది.. బహుమతి పొందింది
భువనేశ్వర్ : పెళ్లి కూతురు అలంకరణలో మమత భోయ్ మెరిసిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో తాను నూతన జీవితంలోకి ప్రవేశించబోతున్నాననే ఆలోచనతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పచ్చని పందిరి మమత నూరేళ్ల జీవితానికి సాక్ష్యమన్నట్లు నిలిచింది. నిండు నూరేళ్లు చల్లగా బతకమని ఆశీర్వదించడానికి తన బంధువులంతా తరలి వచ్చారు. మరి కాసేపట్లో మాంగళ్యధారణ జరుగనుంది. ఈ లోపు వరుడు మంటపానికి వచ్చాడు.. సారి తీసుకొచ్చారు. అతడిని చూస్తే.. పెళ్లి కొడుకు అనే అభిప్రాయం అక్కడున్న ఎవరికి కలగడం లేదు. వరుడు సమీపిస్తోన్న కొద్ది మందు వాసన గుప్పుమంటోంది. మత్తులో తూగుతూ.. స్థిరంగా నిలబడేందుకు కూడా లేక పోవడంతో నలుగురు వ్యక్తులు కలిసి అతడిని మంటపానికి తీసుకొచ్చారు. బంధువులతో పాటు మమత కూడా అతని వాలకానికి ఆశ్చర్యపోయింది. ఇలాంటి వ్యక్తితోనా తాను జీవించబోయేది అనుకుంది. వెంటనే ఓ నిర్ణయానికొచ్చింది. తాను ఈ పెళ్లి చేసుకోబోవడం లేదంటూ మంటపం నుంచి వచ్చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె నిర్ణయాన్ని ఆమోదించారు. విషయం కాస్తా జిల్లా అధికారులకు తెలిసింది. వారు మమత చూపిన తెగువను మెచ్చుకుంటూ రూ. 10 వేల నగదు బహుమతిని అందజేశారు. మమత ధైర్యం ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ విషయం గురించి మమత మాట్లాడుతూ.. ‘మత్తులో జోగుతున్న పెళ్లి కొడుకును చూడగానే ఇతనితో కలిసి జీవితాంతం ఎలా బతకాలి అనిపించింది. ఆ క్షణమే అతడిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా నాకు మద్దతుగా నిలిచారు. అందుకు వారికి ధన్యవాదాలు’ అన్నారు మమత. ఆమె చూపిన చొరవను ప్రశంసిస్తూ.. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ప్రభుత్వం మమతా భోయ్ను ప్రశంసించింది. -
టీటీడీ కల్యాణ మండపంలో బాల్య వివాహం
అడ్డుకున్న పోలీసులు వారు వెళ్లిన తర్వాత యథాప్రకారం పెళ్లి కార్వేటినగరం : పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం బాల్య వివాహం చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన కే.ఎం.నారాయణ(26)కు శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా వెంకటగిరి మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన లీలావతి(16)కి కార్వేటినగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాల్య వివాహం నేరమని తెలపడంతో ఆపేస్తున్నట్టు బంధువులు తెలపడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత టీటీడీ సిబ్బంది సూచనల మేరకు పెళ్లి కుమార్తె ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్పించి ఆదివారం 2.30 గంటలకు నిర్ణయించిన ముహూర్తానికి గంట ముందే వివాహాన్ని జరిపించారు. వరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్టు తెలిసింది. వరకట్నం కోసం బాల్యవివాహం చేసుకున్నట్లు సమాచారం. శ్రీవేణు గోపాలస్వామి ఆలయంలో పనిచేసే సిబ్బంది కూడా ఈ వివాహానికి సహకరించడం దారుణమని స్థానికులు వాపోయారు. ఆలయంపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కింది స్థాయి సిబ్బంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడి కల్యాణ మండపంలో బాల్య వివాహం చేస్తుంటే ఐసీడీఎస్ అధికారిణి అడ్డుకున్నారు. కల్యాణ మండపాన్ని అద్దెకు ఇచ్చే సమయంలో అధికారులు వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రాలను చూడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
బొండా జోరు.. ‘తమ్ముళ్ల’ బేజారు
సెంట్రల్ ఎమ్మెల్యే దూకుడుతో పార్టీకి ఓ వర్గం దూరం నష్ట నివారణకు తమ్ముళ్ల ఎత్తుగడ సత్యనారాయణపురం కల్యాణ మండపాన్ని బ్రాహ్మణ సంఘానికి ఇప్పిస్తామని కొత్త వివాదం టీడీపీ ‘చీలిక’ రాజకీయం బీజేపీ సహా విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధం విజయవాడ : నగరం నడిబొడ్డున ఉన్న భువనేశ్వరీ పీఠం ఆధీనంలోఉన్న కల్యాణమండపం స్వాధీనం చేయించే వ్యవహారంలో శాసనసభ్యుడు బొండా ఉమా నడిపినట్లుగా ప్రచారం జరుగుతున్న రాజకీయ ఎత్తుగడ ఆ పార్టీ నేతల్లో కంగారు పుట్టించింది. ఎమ్మెల్యే చర్యతో నగరంలో ఒక సామాజిక వర్గానికి పార్టీ దూరమయ్యే ప్రమాదం ఉందనే భయంతో తెలుగు తమ్ముళ్లంతా నష్ట నివారణకు రంగంలోకి దిగారు. కల్యాణమండపాన్ని తామే బ్రాహ్మణ సంఘానికి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించి మరో వివాదానికి వారు బీజం వేశారు. పనిలో పనిగా మిత్రపక్షమైన బీజేపీ సహా మిగిలిన విపక్షాలపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు. కల్యాణ మండపాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి తెచ్చేలాచేసి దానిని తన పార్టీ కార్యాల యంగా మార్చుకోవడానికి ఎమ్మెల్యే రాజ కీయం నడిపారనే ఆరోపణతో బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు మిత్రపక్షం బీజేపీతోపాటు విపక్షాలన్నీ గొంతు కలపడంతో తెలుగుతమ్ముళ్లు కంగుతిన్నారు. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. యన ఆదేశం మేరకు పార్టీ నగర నేతలంతా నష్ట నివారణకు రాజకీయ వ్యూహం సిద్ధం చేశారు. బీజేపీపై దాడికి దిగుతూనే ఆ పార్టీకి చెందిన దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావుతో కల్యాణమండపం సీలు తొలగించాలని సవాలు చేస్తున్నారు. చీలిక రాజకీయం కల్యాణ మండపం స్వాధీనంపై నగరంలోని బ్రాహ్మణ సంఘాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు మరో వివాదానికి బీజం వేసి తమ పంతం నెగ్గించుకునే రాజకీయ మంత్రాగానికి తెర లేపారు. కల్యాణ మండపాన్ని బ్రాహ్మణసంఘానికి అప్పగించేలా చేసి పరోక్షంగా దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే వ్యూహానికి సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనతో బ్రాహ్మణ సంఘాల్లో చీలికతెచ్చి తమకు అనుకూలమైన సంఘానికి కట్టబెట్టి పరోక్షంగా దక్కించుకోవాని రాజకీయం నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, అనుబంధ సంఘాల అధ్యక్షుడు పట్టాభి, సూపర్ బజార్ చైర్మన్ రఘురామరాజు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి బ్రాహ్మణులకు టీడీపీ వ్యతిరేకంకాదంటూ చెప్పారు. కల్యాణమండపాన్ని వారికి ఇప్పిస్తామన్నారు. మండపానికి వేసిన సీలు తొలగిస్తామని మాత్రం హామీ ఇవ్వకపోవడం గమనార్హం.