Marathi film producer
-
ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు
ప్రముఖ నటుడు షాయాజీ షిండే టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆ డైలాగ్ ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. టాలీవుడ్లో సోలో, సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో సహా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయనపై మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అసలేం జరిగిందంటే..: అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ మూవీలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేశారు. నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారు. ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు. నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతోఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ. 5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు. -
గుడిలో సినీ నిర్మాత ఆత్మహత్య
ముంబై : మరాఠీ సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు సదానంద్ లాడ్ అలియాస్ పప్పు లాడ్ ముంబైలోని ఓ దేవాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ బిల్డర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పప్పు లాడ్(58) ముంబైలోని గిర్గాంలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న గణపతి దేవాలయానికి ప్రతి రోజు వెళ్తుంటారు. బుధవారం ఉదయం ఒక్కరే ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆలయ పూజారికితో కాసేపు మాట్లాడి, పక్కన ఉన్న గదిలో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లారు. కాసేపటి తర్వాత ఏదో అవసర నిమిత్తం పూజారి ఆ గదిలోకి వెళ్లి చూడగా సదానంద్ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించారు. వెంటనే పూజారి పక్కన ఉన్న వారికి సమాచారం ఇచ్చి తలుపులు తెరచి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. ప్రముఖ బిల్డర్ వేధింపుల కారణంగా సదానంద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా ఆత్మహత్య విషయం తెలుసుకున్న సదానంద్ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు ఎంతో ధైర్యాన్ని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదన్నారు. సదానంద్ మరాఠీలో 12 చిత్రాలను పైగా నిర్మించారు. -
భార్య వేధింపులు, నిర్మాత ఆత్మహత్య
పుణె: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో మరాఠీ సినీ నిర్మాత అతుల్ బి టప్కీర్ (35) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని ఓ హోటల్ గదిలో ఆయన ఆదివారం మృతి చెందారు. కాగా అతుల్ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. మరాఠీ భాషలో ఓ లేఖను శనివారం తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఆర్థిక నష్టాలు, కుటుంబ గొడవల కారణంగానే ప్రాణం తీసుకుంటున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. 2015లో విడుదలై విజయం సాధించిన ‘ధోల్ తాషే’ చిత్రం అతుల్ నిర్మించిందే. తన తండ్రి, సోదరి తనకు మద్దతుగా నిలిచారని, అయితే భార్య ప్రియాంక మాత్రం వేధింపులకు గురి చేసినట్లు ఆయన తన లేఖలో వివరించారు. భార్య ఇంటి నుంచి వెళ్లగొట్టిందని, దాంతో తాను గత ఆరు నెలలుగా బయటే ఉంటున్నానని, అంతేకాకుండా పిల్లలను తననుంచి దూరం చేసిందని, తనపై ఆరోపణలు చేసి, అందరి ఎదుట చులకన చేసి మాట్లాడేదని అతుల్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ప్రియంక సోదరులు కూడా తనపై చేయి చేసుకునేవారని తెలిపాడు. అలాగే కొద్దిరోజుల క్రితం తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. అలాగే ఓ మహిళ ఫిర్యాదు చేసినప్పుడు...పోలీసులు ఎదుటవారి వెర్షన్ కూడా వినాలని... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అతుల్ టప్కీర్ కోరారు. తన పిల్లలను భార్య షోపించలేదని, అందువల్ల వారిని తన తండ్రే వారిని చూసుకోవాలని తెలిపాడు. అలాగే తన భార్య వేధింపులకు సంబంధించిన ఆధారాలన్నీ పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసి పెట్టినట్లు అతుల్ తన లేఖలో తెలిపాడు. కాగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.