భార్య వేధింపులు, నిర్మాత ఆత్మహత్య | Marathi filmmaker Atul B Tapkir found dead, says his wife threw him out in Facebook post | Sakshi
Sakshi News home page

భార్య వేధింపులతో నిర్మాత ఆత్మహత్య!

Published Mon, May 15 2017 8:28 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

భార్య వేధింపులు, నిర్మాత ఆత్మహత్య - Sakshi

భార్య వేధింపులు, నిర్మాత ఆత్మహత్య

పుణె: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో మరాఠీ సినీ నిర్మాత అతుల్‌ బి టప్కీర్‌ (35) విషం తాగి  ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని ఓ హోటల్‌ గదిలో ఆయన ఆదివారం మృతి చెందారు.  కాగా అతుల్‌ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. మరాఠీ భాషలో  ఓ లేఖను శనివారం తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఆర్థిక నష్టాలు, కుటుంబ గొడవల కారణంగానే ప్రాణం తీసుకుంటున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. 2015లో విడుదలై విజయం సాధించిన ‘ధోల్ తాషే’  చిత్రం అతుల్‌ నిర్మించిందే. తన తండ్రి, సోదరి తనకు మద్దతుగా నిలిచారని, అయితే భార్య ప్రియాంక మాత్రం వేధింపులకు గురి చేసినట్లు ఆయన తన లేఖలో వివరించారు.

భార్య ఇంటి నుంచి వెళ్లగొట్టిందని, దాంతో తాను గత ఆరు నెలలుగా బయటే ఉంటున్నానని, అంతేకాకుండా పిల్లలను తననుంచి దూరం చేసిందని, తనపై ఆరోపణలు చేసి, అందరి ఎదుట చులకన చేసి మాట్లాడేదని అతుల్‌ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే ప్రియంక సోదరులు కూడా తనపై చేయి చేసుకునేవారని తెలిపాడు. అలాగే కొద్దిరోజుల క్రితం తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.

అలాగే ఓ మహిళ ఫిర్యాదు చేసినప్పుడు...పోలీసులు ఎదుటవారి వెర్షన్‌ కూడా వినాలని... మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అతుల్‌ టప్కీర్‌ కోరారు. తన పిల్లలను భార్య షోపించలేదని, అందువల్ల వారిని తన తండ్రే వారిని చూసుకోవాలని తెలిపాడు. అలాగే తన భార్య వేధింపులకు సంబంధించిన ఆధారాలన్నీ పెన్‌ డ్రైవ్‌లో సేవ్‌ చేసి పెట్టినట్లు అతుల్‌ తన లేఖలో తెలిపాడు. కాగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement