marriage day celebration
-
పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది! క్షణికావేశంలో..
ఆనందపురం (భీమిలి): క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. భార్యాభర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు తారాస్థాయికి చేరి హత్యకు పురిగొల్పాయి. పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది. మండలంలోని శొంఠ్యాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన హత్య ఘటన రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన పంతుల సూర్య తీర్ధ ప్రసాద్ 20 ఏళ్ల కిందట మండలంలోని శొంఠ్యాం గ్రామానికి వలస వచ్చారు. ఆయనకు విశ్వనాథశాస్త్రి అనే కుమారుడు, వెంకట లలితాదేవి(35) అనే కుమార్తె ఉన్నారు. కాగా వెంకట లలితాదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. మళ్లీ ఎనిమిదేళ్ల కిందట విజయనగరానికి చెందిన ఆండ్ర రవికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, కుమారుడుతో వెంకట లలితాదేవి శొంఠ్యాంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడే వారని స్థానికులు అంటున్నారు. శనివారం ఆ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజునాడు కూడా భర్త తనకు అచ్చటా, ముచ్చటా చూడలేదని సరదాగా కనీసం బయటకు కూడా తీసుకెళ్లలేదని వెంకట లలితాదేవి భర్తతో గొడవ పడింది. ఇంటి వద్దే ఉన్న వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని ఆపుకోలేని రవికుమార్ సుత్తితో లలితాదేవి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన జరిగిన తర్వాత రవికుమార్ పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే.. -
టూ క్యూట్ అంటున్న ఉపాసన
టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఒక హీరో ఆడియో ఫంక్షన్లకు మరొకరు హాజరవ్వడం, బయట పార్టీల్లో సందడి చేయడం, ఇతర హీరోల సినిమాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం చూస్తూనే ఉన్నాం. రంగస్థలం బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భరత్ అనే నేను చిత్ర నిర్మాత ఏర్పాటు చేసిన పార్టీలో ప్రిన్స్ మహేశ్ బాబు, మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ మధ్యే కాదు తమ కుటుంబాల మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం ఉందనేలా చెర్రీ దంపతులు, ఎన్టీఆర్ ఇంట్లో సందడి చేశారు. శనివారం ఎన్టీఆర్, ప్రణతి దంపతుల పెళ్లి రోజు వేడుకకు(మే 5న) చెర్రీ దంపతులు హాజరయ్యారు. ఎన్టీఆర్ దంపతులతో కేక్ కట్ చెయించారు. అలాగే ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్‌తో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా అభయ్ రామ్ బుజ్జి బుజ్జిగా ‘ఐ వనా ఫాలో ఫాలో యూ’ అంటూ తన తండ్రి చిత్రంలోని పాటను పాడుతున్న వీడియోను కూడా ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫొటో తెగ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. #happyaaniversary @tarak9999 & #pranathi ❤️❤️ #abhayram our new bestie. #ramcharan pic.twitter.com/nLJ7cuMLjj — Upasana Kamineni (@upasanakonidela) May 5, 2018 -
ఎన్టీఆర్ ఇంట్లో చెర్రీ దంపతుల సందడి
-
కొడుకు మ్యారేజ్‌డేకి వెళ్లొస్తూ తల్లి దుర్మరణం
గొడిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం నక్కపల్లి : మ్యారేజిడే వేడుకకు వెళ్లి వస్తుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా ఏడుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ రేసపువానిపాలెంలో ఏయూ రిటైర్డు ప్రొఫెసర్ దాసరి ప్రభాకర్‌రావు కుటుంబం నివసిస్తోంది . ఈయన భార్య అమ్మాజీ(60) కూడా బ్యాంకులో పనిచేసి రిటైరయ్యారు. వీరి ఏకైక కుమారుడు సందీప్ కాకినాడలో రిలయన్స్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సందీప్ పెళ్లి రోజు. దీంతో కుమారుడి పెళ్లిరోజు వేడుకకు హాజరయ్యేందుకు ప్రభాకరరావు కుటుంబ సభ్యులు కాకినాడ వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక సోమవారం వీరంతా తిరుగుప్రయాణమయ్యారు. కొడుకు సందీప్ కారులో వీరంతా విశాఖ బయలుదేరారు. రాత్రి 8గంటలప్రాంతంలో కారు మండలంలోని గొడిచర్లసమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అడ్డొచ్చింది. దీన్ని తప్పించే ప్రయత్నంలో కారు పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీలుకొట్టింది. ఈ ఘటనలో సందీప్ తల్లి అమ్మాజీ అక్కడికక్కడే మరణించారు. ప్రభాకర్‌రావుకు కాలు విరిగిపోయింది. తలకు బలమైన గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న సందీప్ కాలు కూడా విరిగిపోయింది. నడుంకు బలమైన గాయమైంది. మేనకోడలు తేజస్విని తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. చంద్రిక, సంధ్యలతోపాటు రెండేళ్ల చిన్నారి ప్రణవి కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులను విశాఖ దిగబెడదామని బయలుదేరానని ఇంతలో ప్రమాదం సంభవించిందని సందీప్ సాక్షికి తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో తుని ఏరియా ఆస్పత్రి మారుమోగింది. తునిలో ఉన్న సందీప్ బంధువులు ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి బాధితులకు సపర్యలు చేశారు. ఏరియా ఆస్పత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తరలించారు.