Married woman murder
-
అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు
ప్రకాశం: మండలంలోని జిళ్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోటా రాధ (35) హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం...జిళ్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోటా రాధకు, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌రెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరు హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నుంచి జిళ్లెళ్లపాడు గ్రామానికి వచ్చారు. భర్త మోహన్‌రెడ్డి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. రాధ కుమారుడిని తీసుకొని కనిగిరి వెళ్లి వస్తానని తండ్రి సుధాకర్‌రెడ్డితో చెప్పి వెళ్లింది. కనిగిరిలో ఉంటున్న బాబాయి వద్ద కుమారుడిని వదిలిపెట్టి బజారులో పని ఉంది చూసుకొని వస్తానని చెప్పి వెళ్లింది. రాత్రి 10 గంటలకు కూడా రాధ ఇంటికి రాకపోవడంతో సుధాకర్‌రెడ్డి, అతని తమ్ముడు కనిగిరిలో వెతికారు. అయినా కనిపించకపోవడంతో కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనిగిరి పోలీసులు ఫోన్ లోకేషన్ జిళ్లెళ్లపాడు వద్ద చూపిస్తుందని వెలిగండ్ల పోలీసులకు తెలిపారు. వెలిగండ్ల పోలీసులు జిళ్లెళ్లపాడు అడ్డరోడ్డు వద్దకు వెళ్లి చూడగా తారురోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని డీఎస్పీ రామరాజు, సీఐ శ్రీనివాసరావులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. రాధ హత్యపై పలు అనుమానాలు కోటా రాధ్య హత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాధకు గన్నవరం పంచాయతీ గండ్లోపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గండ్లోపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇటీవల ఐపీ పెట్టినట్లు సమాచారం. హత్యకు ఓ కారును ఉపయోగించినట్లు సమాచారం? ఈ హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ హత్యలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. -
దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు!
సాక్షి, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని అయ్యగారిపేటలో బుధవారం ఓ వివాహిత హత్య సంఘటన వెలుగుచూసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన పంతంగి వాణి(24) సత్తుపల్లిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణంలో పని ముగించుకుని ఆటోలో సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సందీప్‌తో కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయింది. ఆటోలో అయ్యగారిపేటలోని పామాయిల్ తోట వరకు వెళ్లారు. మళ్లీ ఫోన్ చేసినప్పుడు రావాలని ఆటో డ్రైవర్‌కు చెప్పి పంపించారు. బుధవారం ఉదయం మహిళ మృతి చెందిపడి ఉన్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. పంతంగి వాణిగా గుర్తించారు. చున్నీతో మెడకు చుట్టి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. చేతి గాజులు పగిలి, దుస్తులు చిరిగి కన్పించాయి. (అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్ ) ఆటో డ్రైవర్ గంట తర్వాత సందీప్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకురావాలా? అని అడిగాడు. ‘దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు.. నీ డబ్బులు మళ్లీ కలిసినప్పుడు ఇస్తా’అని సందీప్ చెప్పినట్టు సమాచారం. దీంతో భయభ్రాంతులకు గురైన సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జరిగిన విషయాలను బంధువులకు వివరించటంతో పాటు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు.. సందీప్ హత్య చేసినట్టు అనుమానించి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా సందీప్ కదలికలను గుర్తించినట్టు సమాచారం. మహిళను హత్య చేసి ఏమీ తెలియనట్టు విధులకు కూడా హాజరైనట్టు తెలిసింది. భార్యను వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్‌పై ఇప్పటికే ఓ కేసు ఉంది. (ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య) ఇద్దరు పిల్లల మూగరోదన పంతంగి వాణి, శ్రీనివాసరావులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త చెవిటి, మూగవాడు. కూలి పనులకు వెళ్తుంటాడు. మృతురాలు పంతంగి వాణిది పశ్చిమగోదావరిజిల్లా లింగపాలెం మండలం ముచ్చర్ల గ్రామం. వీరికి ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. పంతంగి వాణి విగతజీవిగా పడి ఉండటంతో పిల్లలకు ఏమీ అర్థంకాగా బిత్తరపోయి చూస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నాలుగు నెలల క్రితం నుంచే సత్తుపల్లిలోని దుకాణంలో పని చేస్తోంది. మృతదేహానికి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపారు. -
వివాహిత దారుణహత్య
అనంతపురం, పుట్లూరు: మడుగుపల్లి ఎస్సీ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్తే ఆమెను కడతేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడుగుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి(30)కి ఎనిమిదేళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన వీరశేఖర్‌తో వివాహమైంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల భార్య ప్రవర్తనపై వీరశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. వేధింపులు పెరిగిపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆరేళ్ల కుమారుడు దేవాను తీసుకుని వెంకటలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. బంధువులు, ఇతర పెద్దలు పంచాయితీ చేసి నెల రోజుల క్రితం మెట్టినింటికి పంపారు. అయినా వీరశేఖర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మళ్లీ 20 రోజుల క్రితం ఆమె మడుగుపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరశేఖర్ మడుగుపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయాన్నే తాను దుగుమర్రికి వెళ్తున్నానని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నడిపి బయన్న, లక్ష్మిదేవిలకు చెప్పి బయల్దేరాడు. అల్లుడు వెళ్లిపోయాక బయన్న, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వేళ కుమారుడు సమీప ఇళ్ల వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఇక ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మి కాసేపటికే దారుణహత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలంలో రుబ్బుడుగుండు, కొడవలి పడి ఉన్నాయి. హత్యాస్థలిని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ దేవేంద్రకుమార్ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై మృతురాలి తల్లిదండ్రులను ఆరా తీశారు. భర్తే రుబ్బుడుగుండుతో మోది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఏలూరులో వివాహిత హత్య
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో ఒక వివాహిత పట్టపగలే హత్యకు గురైంది. దుండగుడు ఆమె చీర కొంగునే గొంతుకు బిగించి హత్య చేసి పరారయ్యాడు. స్థానిక వంగాయిగూడెం సమీపంలోని సుబ్రహ్మణ్యం కాలనీలో జరిగిన ఈ హత్య సంఘటన నగరంలో కలకలం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా హత్యకు గురైనట్లు నిర్థారించారు. వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్ళి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన భార్యభర్తలు ఆత్మారామ్ దొహరే, సుమన్ దొహరేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండేళ్ళ క్రితం మధ్యప్రదేశ్ నుంచి ఏలూరు వచ్చి సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆత్మరామ్ దోహరే బిస్కెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు మధ్యప్రదేశ్‌లోనే ఉంటుండగా వీరితో 8ఏళ్ళ కుమార్తె, 6ఏళ్ళ కుమారుడు ఉంటున్నారు. గురువారం ఉదయం పిల్లలు బడికి వెళ్ళగా ఆత్మారామ్ దోహరే బిస్కెట్లు విక్రయించేందుకు బయటకు వెళ్ళాడు. సాయంత్రం సమయంలో భార్యకు ఫోన్ చేయగా ఎంతకూ ఫోన్ తీయకపోవటంతో కంగారుపడి ఇంటి పక్కవారికి ఫోన్ చేశాడు. స్థానికులు వెళ్ళి చూసేసరికి అతని భార్య సుమన్ దోహరే (30) గొంతుకు చీరకొంగు బిగించబడి విగతజీవిగా నేలపై పడిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి ఆరా తీశారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆత్మారామ్ దోహరే మేనల్లుడు బకిల్ అప్పుడప్పుడూ అతని ఇంటికి వచ్చి వెళుతుంటాడు. అతను విశాఖపట్నంలో పానీపూరీ అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. సుమన్ దోహరేతో బకిల్‌కు వివాహేతర సంబంధం ఉందనీ, మధ్యమధ్యలో అతని ఇంటికి వస్తూ ఉంటాడని తెలుస్తోంది. బకిల్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఉంటాడని, సుమన్ దోహరేతో ఏదైనా ఘర్షణ జరిగి ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఆత్మారామ్ దోహరే ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి చేతిలో వివాహిత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదని పగ పెంచుకున్న ఓ కిరాతకుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన సానియాకు ఇదివరకే వివాహమైంది. ఆమె నగరానికి చెందిన సల్మాన్‌తో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా సానియా తనను పట్టించుకోవడం లేదంటూ రగిలిపోయిన సల్మాన్ ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు. అనంతరం సంతోష్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
అనుమానంతో సుందరి హత్య
తిరువొత్తియూరు: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత హత్యక గురైంది. చెన్నై పల్లికరణై గాంధీ నగర్‌కు చెందిన అయ్యప్పన్ (42) లారీ డ్రైవర్. ఇతని భార్య సుందరి (32). వీరికి జయశ్రీ (10), వర్షిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుందరికి అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఉన్నట్టు అయ్యప్పన్కు తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి వీధిలో ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు కొద్ది సమయం తరువాత ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని ఇరుగుపొరుగు వారిని విచారణ చేశాడు. అనుమానించిన ఇరుగుపొరుగు కిటికిలో నుంచి చూడగా సుందరి మంచంపై రక్తపు మడుగులో శవంగా పడి ఉంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లికరణై పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి సుందరి మృత దేహాన్ని పరిశీలించగా ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుందరి భర్త అదృశ్యమై ఉండడంతో భార్యను అతను హత్య చేసి పారిపోయి ఉండొచ్చుని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వివాహిత దారుణహత్య
ఓ వివాహిత మహిళను ఒంటరిని చేసి పదిమంది చుట్టుముట్టి గ్రామం నడిబొడ్డున విచక్షణారహితంగా కట్టెలతో దాడిచేసి హతమార్చారు. అడ్డుకోబోయిన బాలింతను కాళ్లతో తన్ని దాష్టీకానికి దిగారు. ఈ దారుణాన్ని చూసి మనస్తాపానికి గురైన ఆడపడచు ఆత్మహత్యాయత్నం చేసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఘటనలతో చాలకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమందేపల్లి: చాలకూరు గ్రామంలో కల్యాణి (36) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్యాణి, చిరంజీవి దంపతులు. చిరంజీవి, ఇంటి పక్కనే ఉన్న రాము, రామాంజినప్ప, రామాంజినమ్మలు గత కొద్దిరోజులుగా చిన్నపాటి గొడవలు పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూపురం వెళ్లిన చిరంజీవిపై రాము, రామాంజినప్పలు దాడి చేశారు. దీంతో బాధితుడు సోమందేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకేసామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య గొడవను రాజీ చేయించేందుకు శనివారం ఉదయం గ్రామపెద్దలు పంచాయితీ చేశారు. ఆ పంచాయితీ తీర్మానం మేరకు చిరంజీవి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. దాష్టీకం జరిగిందిలా.. శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న చిరంజీవి భార్య కల్యాణితో రాము, రామాంజినప్ప, రామాంజినమ్మ, నరసింహప్పలు గొడవకు దిగారు. గ్రామ నడిబొడ్డున దాదాపు పదిమంది ఆమెను చుట్టుముట్టి కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కల్యాణి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దాడిని అడ్డుకునేందుకు బాలింత అయిన మేనకోడలు మంజుల ప్రయ త్నించింది. అయితే ఆ వ్యక్తులు బాలింత అని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. గ్రామ నడిబొడ్డున అందరూ చూస్తుండగా ఇంత ఘోరం జరుగుతున్నా అడ్డుకునేవారే లేరా అంటూ కల్యాణి ఆడపడచు అఖిల ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం కల్యాణి, అఖిలను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చాలకూరులో పోలీస్ పికెట్ వివాహిత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పెనుకొండ సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి చాలకూరు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేవరకు రెండురోజులు పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.. ఆపై..
సాక్షి, ప్రకాశం: వివాహితను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళను తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అతను కత్తితో పాటు కంభం పోలీస్ స్టేషన్ వెళ్లి సరండర్ అయ్యాడు. అయితే నిందితుడిని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతదేహం గుర్తించే పక్రియలో భాగంగా అతడ్ని పోలీసులు సంఘటన స్థలానికి తరలించారు. ఈ హత్యకు వారిద్దరి మధ్య అక్రమ సంబంధమేన కారణమని సమాచారం. మృతురాలు నాగమణిని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సుశీలది హత్యే..
♦ ఈనెల ఒకటిన ముదిమాణిక్యం వద్ద ఘటన ♦ నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ♦ కోరిక తీర్చనందుకే రాజు హతమార్చాడని డీఎస్పీ వెల్లడి జోగిపేట: వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కోరిక తీర్చనందుకే ఓ యువకుడు ఆమెను అంతమొదించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఈనెల ఒకటిన పుల్కల్ మండలం ముదిమాణిక్యం శివారులో జరిగిన హత్య కేసు వివరాలను మెదక్ ఇన్చార్జి డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు బుధవారం జోగిపేటలోని సీఐ చాంబర్లో విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా... పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ పంచాయతీ పరిధిలోని సువాలీ తండాకు చెం దిన గోరాం సుశీల (30), సురేశ్ దంపతులు. వీరు సంగారెడ్డిలో అడ్డా కూలీలు. కొన్ని రోజులుగా భార్యాభర్తలు వేర్వేరుగా పనులు చేసుకుంటున్నారు. ఈనెల ఒకటిన ఆమె పనుల కోసం సంగారెడ్డికి వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఓ బావిలో ఆమె శవం లభించింది. ఫోన్ కాల్స్ ఆధారంగా... సుశీల ఫోన్‌కాల్స్ ఆధారంగా బస్వాపూర్‌కు చెందిన వెండికోలు రాజును నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. సుశీలతో వెండికోలు రాజుకు గత రెండు నెలలుగా సన్నిహిత సంబంధం ఉంది. రెండు నెలల్లోనే సెల్ఫోన్లో 274 సార్లు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన రోజున ఆ స్థలంలో టవర్లను పరిశీలించగా కేవలం సుశీల, రాజుకు సంబంధించిన ఫోన్ నంబర్లు మాత్రమే పనిచేశాయి. బుధవారం అతణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఆ రోజు ఏం జరిగిందంటే...? బస్వాపూర్‌కు చెందిన వెండికోలు రాజు సుశీలతో సన్నిహితంగా ఉంటున్నాడు. జూన్ ఒకటిన సంగారెడ్డి నుంచి రాజు, సుశీల ఒకే బస్సులో పక్కపక్కనే కూర్చోని వచ్చారు. సాయంత్రం 6.15 గంటలకు ముదిమాణిక్యం గ్రామంలో సుశీల దిగిపోయింది. బస్వాపూర్‌లో రాజు దిగి ఇంటికి వెళ్లాడు. అప్పుడే రాజు సుశీలకు ఫోన్ చేశాడు. ‘నేను ఇంటికి వెళ్లి వెంటనే వస్తా, నీవు ముదిమాణిక్యం వద్దే ఉండాలి’ అని సూచించాడు. అప్పుడే సుశీలకు ఆమె భర్త సురేశ్ ఫోన్ చేసి నీవు ఎక్కడున్నావ్? అని అడగ్గా, ముదిమాణిక్యం కల్లు దుకాణం వద్ద ఉన్నానని చెప్పింది. తండాకు బయలుదేరాలని, తాను ఎదురుగా వస్తానని ఫోన్లో చెప్పాడు. వెంటనే ఆమె ఇదే విషయాన్ని వెండికోలు రాజుకు తెలిపింది. అయినా అతను వినిపించుకోకుండా తాను వచ్చేంతవరకు ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. అయినా ఆమె వినకుండా ముదిమాణిక్యం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న సువాలీ తండాకు కాలినడకన బయలు దేరింది. రాజు ఫోన్ చేస్తున్నా ఆమె కట్ చేస్తుండడంతో ఆగ్రహించాడు. ఆమె మార్గమధ్యంలో అడ్డగించాడు. సురేశ్ వస్తున్నాడు వెళ్లిపో... అని ఆమె ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా తన కోరిక తీర్చాలంటూ గొడవకు దిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ వైరుతో ఆమె గొంతుకు బిగించి గట్టిగా లాగడంతో అక్కడికక్కడే ప్రాణాలు వది లింది. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని దగ్గరలోని బావి లోకి తోసేసిన రాజు బస్వాపూర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయాడని డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జోగిపేట సీఐ వెంకటయ్య, పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మేనమామే హత్య చేశాడు!
విజయనగరం: విజయనగరం రూరల్ మండలం జమ్ము గ్రామంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వివాహిత కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను మేనమామే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఆమె వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసుల విచారణలో మేనమామ హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. **