బెస్ట్ యాక్టర్స్ రెడీ!
‘‘ఈ సినిమా చూస్తుంటే నాకు ‘లేడీస్ టైలర్’ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లోనే ఆ సినిమాను వందసార్లు ప్రదర్శించాం. కామెడీగా ఉందనే వారే కానీ, కొనేవాళ్లు ఒక్కళ్లూ కనపడలేదు. హాస్యాన్ని చిన్న చూపు చూశారు. అలాంటి పరిస్థితుల నుంచే నేను కామెడీని పండించే హీరోగా మారాను కానీ ఇప్పుడు ఆ హాస్యమే లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితులు వచ్చాయి’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అన్నారు.
నందు, షామిలి జంటగా మారుతీ టీమ్ వర్క్స్ పతాకంపై కుమార్ అన్నమ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బెస్ట్ యాక్టర్స్’. జీవన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రప్రసాద్ బిగ్‌సీడీని ఆవిష్కరించి హీరో తరుణ్‌కు అందించారు. మారుతి మాట్లాడుతూ -‘‘ఓ మలయాళ చిత్రం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నాం. చాలా కష్టపడి అరుణ్ ఈ సినిమా రూపొందించారు’’అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎమ్ కీరవాణి, దర్శకుడు సురేందర్‌రెడ్డి, జీవన్, నందు, షామిలి, మధురిమ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.