Mary Koms
-
మేరీ‘గోల్డ్’
మేరీ కోమ్... మేరీ కోమ్... మేరీ కోమ్... ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరో స్వర్ణం సొంతం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన మేరీ... తుదిపోరులో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 35 ఏళ్ల వయసులో... ముగ్గురు పిల్లల తల్లి అయినా... తన పంచ్‌లో పదును తగ్గలేదని మరోసారి నిరూపించి... ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా మెరిసింది. న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ సొంతగడ్డపై జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 48 కేజీల ఫైనల్లో మేరీ కోమ్ 5–0తో హనా ఒఖోటా (ఉక్రెయిన్) పై గెలుపొందింది. బరిలో దిగిన అన్ని బౌట్లలో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ మణిపురి మణిపూస తుదిపోరులోనూ అదే రీతిలో చెలరేగి 30–27, 29–28, 29–28, 30–27, 30–27తో ఏకపక్ష విజయం సాధించింది. ఫైనల్ బౌట్లో మేరీ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. తొలి రౌండ్లో తన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇక రెండో రౌండ్ ప్రారంభంలోనే బలమైన హుక్తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ రౌండ్ పూర్తయ్యేసరికే ఆమె విజయం దాదాపుగా ఖాయమైంది. చివరిదైన మూడో రౌండ్లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ... సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చిన మేరీ భావోద్వేగానికి గురై ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ‘చాలా ఆనందంగా ఉంది. మీరు చూపే ఆదరాభిమానాలకు స్వర్ణం తప్ప మరేది నెగ్గకూడ దని అనుకున్నా. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేకపోవడం నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఒలింపిక్స్‌లో ఈ (48 కేజీల) విభాగం లేదు. టోక్యోలో 51 కేజీల విభాగంలో బరిలో దిగుతా’అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ చెప్పింది. సోనియాకు రజతం... బరిలో దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే దుమ్మురేపే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యువ బాక్సర్ సోనియా చహల్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. 57 కేజీల ఫైనల్లో సోనియా 1–4తో ఒర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ) చేతిలో ఓడింది. చివరివరకు హోరాహోరీగా పోరాడిన సోనియా 28–29, 28–29, 29–28, 28–29, 28–29తో పరాజయం పాలైంది. ‘నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. అయినా... బాధగా లేదు. రజతం గెలవడం సంతోషాన్నిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతా’అని సోనియా వెల్లడించింది. ప్రధాని మోదీ, జగన్ అభినందనలు... ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆమె విజయం ప్రత్యేకమైందని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. మరిన్ని విజయాలు సాధించాలి... సాక్షి, అమరావతి: ఆరో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు అనేకం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు (5 స్వర్ణాలు, 1 రజతం) సాధించి ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీ తాజా పసిడితో క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ (6 స్వర్ణాలు, 1 రజతం) సరసన నిలిచింది. మేరీ గతంలో 2002, 05, 06, 08, 10లలో స్వర్ణాలు... అరంగేట్ర 2001 చాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఆమె చివరిసారిగా 2010 బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. -
మేరీ మెరిసె...
న్యూఢిల్లీ: పట్టుదల ఉండాలే కాని వయసనేది ఒక అంకె మాత్రమేనని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ నిరూపించింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో సెమీస్ చేరడం ద్వారా ఈ మణిపూర్ మెరిక కొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఏడు పతకాలు గెలిచిన తొలి బాక్సర్‌గా మేరీకోమ్ ఘనత వహించింది. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రజతంతో కలిపి ఆరు పతకాలు నెగ్గిన మేరీకోమ్ తాజా ప్రదర్శనతో తన ఖాతాలో ఏడో పతకాన్ని జమ చేసుకుంది. ఈ టోర్నీకి ముందు ఈ రికార్డు కేటీ టేలర్ (ఐర్లాండ్–6 పతకాలు), మేరీకోమ్ పేరిట సంయుక్తంగా ఉండేది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల మేరీకోమ్ 5–0తో వు యు (చైనా)పై ఘనవిజయం సాధించింది. మేరీకోమ్‌తోపాటు లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మరో మూడు పతకాలను ఖాయం చేశారు. అయితే భారత్‌కే చెందిన పింకీ రాణి (51 కేజీలు), కచారి భాగ్యవతి (81 కేజీలు), మనీషా (64 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 21 ఏళ్ల లవ్లీనా 5–0తో స్కాట్ కయి ఫ్రాన్సెస్ (ఆస్ట్రేలియా)పై; 21 ఏళ్ల సోనియా 4–1తో మెసెలా యెని కాస్టెనాడ (కొలంబియా)పై; 23 ఏళ్ల సిమ్రన్‌జిత్ 3–1తో అమీ సారా (ఐర్లాండ్)పై విజయం సాధించారు. పింకీ 0–5తో పాంగ్ చోల్ మి (ఉత్తర కొరియా) చేతిలో... మనీషా 1–4తో స్టొయికా పెట్రోవా (బల్గేరియా) చేతిలో... భాగ్య వతి 2–3తో జెస్సికా (కొలంబియా) చేతిలో... సీమా 0–5తో జియోలి (చైనా) చేతిలో ఓడారు. బుధవారం విశ్రాంతి దినం. గురు, శుక్రవారాల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా) తో మేరీకోమ్; చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)తో లవ్లీనా... శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జో సన్ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్ డుయు (చైనా)తో సిమ్రన్‌జిత్ తలపడతారు. -
ప్రియాంక హ్యాట్సాఫ్.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోల ప్రశంస!
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్రియాంక చోప్రాను ఓ అందాల తారగానే పరిగణించారు. త్వరలో రాబోతున్న మేరికామ్ చిత్రంతో ప్రియాంక చోప్రా తనేంటో అనే సత్తాను టీజర్ లో రుచి చూపించారు. తాజాగా విడుదలైన మేరికామ్ చిత్ర టీజర్ ప్రేక్షకులు, సినీ అభిమానులను రోమాలు నిక్కబొడిచే విధంగా ఉందని కితాబిచ్చారు. మేరికామ్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ నటులు,టాలీవుడ్ నటులు చేరిపోయారు. మేరికామ్ టీజర్ చూసి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లు ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. మేరికామ్ థియేటర్ ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అద్బుతంగా నటించింది. పాత్ర కోసం ప్రియాంక చూపిన అంకితభావానికి తలవంచాల్సిందే. స్పూర్తిగా నిలిచింది అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తెరపై ప్రియాంక చోప్రా సీతాకోకచిలుకలో దూసుకుపోయింది అంటూ ఆయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు. @bollywood_life @priyankachopra What's the best reaction that you've received so far? #AskPriyanka — Tanvi (@iamtanvi) July 23, 2014 Loved #MaryKom trailer.. @priyankachopra at her best.. Truly depicts the "girl power".. Brilliant! Salute — Rakul Preet (@Rakulpreet) July 23, 2014 Mary Koms Theatrical trailer gave me goosebumps...fantastic performance and unmatched dedication by Priyanka Chopra..take a bow..inspiring — Sundeep Kishan (@sundeepkishan) July 23, 2014 Goosebumps! This @priyankachopra floats like a butterfly and stings like a bee. Mary Kom! http://t.co/RgLutnpG7o — Ayushmann Khurrana (@ayushmannk) July 23, 2014