mass sexual assault
-
మహిళపై సామూహిక లైంగిక దాడికి యత్నం!
పశ్చిమగోదావరి, నల్లజర్ల: నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో కొబ్బరితోటలో కూలీపని చేస్తున్న మహిళపై గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి యత్నిం చారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని వెజ్జు సుబ్బారావుకు చెందిన కొబ్బరితోటలో ఓ జంట మకాం ఉంటూ కూలిపనులు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగి గేటు దూకి తోటలోకి వచ్చారు. ఈ సమయంలో తన భర్త లేడని, ఇదే అదనుగా ముగ్గురు యువకులు తనను తాడుతో బంధించి అత్యాచారం చేయబోయారని, కే కలు వేయడంతో తన భర్త వచ్చి అడ్డుపడగా అతడినీ గాయపర్చారని బాధిత మహిళ పోలీస్‌స్టేషన్ వద్ద విలేకరులకు తెలిపింది. సమీపంలోని జనం వచ్చి యువకులను పట్టుకున్నారని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చె బుతుండగా కొందరు వచ్చి ఆమెను మాట్లాడకుండా కట్టడి చేశారు. దీనిపై అనంతపల్లి ఎస్సై వి.చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేశామని సామూహిక అత్యాచారం అన్నది వాస్తవం కాదన్నారు. మ ద్యం తాగిన యువకులు గలాటా చేసినట్టు గుర్తించామన్నా రు. వారిని అదుపులోకి తీసుకుని న్యూసెన్స్ కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో కూడా కేసు నమోదుకాలేదు. యువకులను తోట యజమానులు గట్టిగా కొట్టడం, వారు తిరిగి తమపై కేసుపెడతారన్న కారణంగానే ఏమీ జరగనట్టు చెప్పాలని బాధిత మహిళపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. యువకులను కొట్టిన విషయంలో రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఎందుకు కేసును తప్పుదారి పట్టిస్తున్నారో తెలియడం లేదు. -
మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి
♦ బాధితురాలు ఏడు నెలల గర్భిణి ♦ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. ♦ ఐదుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు తర్లుపాడు : మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులపై గురువారం తాడివారిపల్లె పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై చౌడేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన యువతికి అదే మండలం గానుగపెంటకు చెందిన వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో ఆమెను భర్త వదలి పెట్టాడు. ఆ క్రమంలో స్వగ్రామం తుమ్మలచెరువు చేరింది. ఇంతలో తల్లిదండ్రులు మరణించటంతో అనాథగా మారింది. మానసిక వికలాంగురాలిపై స్థానికులు కొందరు కన్నేశారు. భోజనం పెడతామంటూ స్థానికంగా నివాసం ఉండే ఐదుగురు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లు పలుసార్లు పశువాంఛ తీర్చుకున్నారు. విషయం తెలుసుకున్న కామాంధులు గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేరుుంచేందుకు ప్రయత్నించారు. 7 నెలలు దాటిన గర్భిణికి గర్భస్రావం చేస్తే ప్రాణహాని ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. తిరిగి ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలి దూరపు బంధువు ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదిలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లపై ఎస్సై చౌడేశ్వర్ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుకాగా ఇద్దరి పేర్లు పోలీసులు తప్పించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.