master series
-
సంప్రాస్‌ను దాటిన జొకోవిచ్
రోమ్: ఈ ఏడాది ఓటమి లేకుండా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. సోమవారం ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్ అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ నంబర్‌వన్ ర్యాంకర్ మరో ఘనత వహించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక వారాలపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో నిలువడంతో అతను ఈ స్థానంలో 287 వారాలు ఉన్నట్టయింది. దాంతో 286 వారాలతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో 310 వారాలతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొలి స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ‘టాప్ ర్యాంక్’ ఘనత స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ–377 వారాలు) పేరిట ఉంది. -
సన్నీత్కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టోర్నీలో సరోజని అకాడమీకి చెందిన సన్నీత్ ఉప్పాటి విజేతగా నిలిచాడు. నేరేడ్మెట్లోని సెయింట్ థామస్ హైస్కూల్లో జరిగిన అండర్–14 బాలుర సింగి ల్స్ ఫైనల్లో సన్నీత్ 8–3తో శాంత్ శరణ్‌పై గెలుపొందాడు. సెమీస్‌లో 8–5తో రిషి వర్మపై, క్వార్టర్స్‌లో 8–4తో యశ్వంత్‌పై విజయం సాధించాడు. -
‘మోంటెకార్లో మాస్టర్’ వావ్రింకా
ఫైనల్లో ఫెడరర్‌పై విజయం కెరీర్లో తొలి మాస్టర్స్ టైటిల్ ఖాతాలో రూ. 4 కోట్ల 57 లక్షల ప్రైజ్‌మనీ మోంటెకార్లో: ఈ ఏడాది తన అద్వితీయ ప్రదర్శనను కొనసాగిస్తూ స్విట్జర్లాండ్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్లో తొలి ‘మాస్టర్స్ సిరీస్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌కే చెందిన దిగ్గజ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో వావ్రింకా 4-6, 7-6 (7/5), 6-2తో విజయం సాధించాడు. గతంలో రోమ్, మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో ఫైనల్స్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్న 29 ఏళ్ల వావ్రింకా మూడో టోర్నీలో మాత్రం విజేతగా అవతరించాడు. గతంలో ఫెడరర్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే నెగ్గిన వావ్రింకా ఐదేళ్ల తర్వాత అతనిపై రెండోసారి గెలిచాడు. చాంపియన్‌గా నిలిచిన వావ్రింకాకు 5,49,000 యూరోలు (రూ. 4 కోట్ల 57 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది వావ్రింకా ఆస్ట్రేలియన్ ఓపెన్, చెన్నై ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గాడు. మైక్ బ్రయాన్ ‘సెంచరీ’ ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో బ్రయాన్ సోదరులు (మైక్, బాబ్) టైటిల్‌ను నెగ్గారు. ఫైనల్లో బ్రయాన్ బ్రదర్స్ 6-3, 3-6, 10-8తో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్)లపై గెలిచారు. ఈ విజయంతో 35 ఏళ్ల మైక్ బ్రయాన్ తన ఖాతాలో 100వ టైటిల్‌ను జమచేసుకున్నాడు. తద్వారా డబుల్స్ విభాగంలో 100 టైటిల్స్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. జోడిగా ఈ కవల సోదరులకిది 98వ టైటిల్ కావడం విశేషం.