మెడికోలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వైఎస్ఆర్ సీపీ
తిరుపతి: స్విమ్స్ ఆసుపత్రికి బదలాయించిన భవనాలను తక్షణమే మెటర్నటీకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం తిరుపతిలో మెడికోలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపింది. శనివారం తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆసుపత్రి భవనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని అసెంబ్లీలో ఎండగడతామని చెప్పారు.
గతంలో ధర్మాసుపత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని వారు గుర్తు చేశారు. మెడికోలకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోమని భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి స్పష్టం చేశారు.