Mathangi
-
మహంకాళి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, హైదరాబాద్: బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. భవిష్యవాణి రంగంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఆషాడం ఆరంభం అవగానే గోల్కొండలో మొదలైన బోనాల పండుగ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ముగుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర పండగ బోనాల పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అన్ని విభాగాలు సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించగలిగాం. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’అని అన్నారు. -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
-
మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి
‘బాహుబలి–2’లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరో నటి సాటి రాలేరనే స్థాయిలో ఆమె నటనపరంగా విజృంభించారు. ఇప్పుడు మరో సినిమాలో రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం. మలయాళంలో ఆమె నటించిన ఓ చిత్రం ‘మాతంగి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. కన్నన్ తమరక్కులమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీని రమ్యకృష్ణ సోదరి వినయ్‌కృష్ణన్ తెలుగులోకి అనువదించారు. సోదరితో వెయ్యి ఎపిసోడ్స్ ‘వంశం’ సీరియల్ నిర్మించిన వినయ్‌కృష్ణన్ ఆ అనుభవంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మాతంగిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. రితేష్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది’’ అని వినయ్‌కృష్ణన్ తెలిపారు.