Mausam
-
వైభవంగా అలీ రెజా సతీమణి సీమంతం వేడుక
బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లో పాల్గొన్న అలీ ఫిజికల్ టాస్కుల్లో మిగతావారికి గట్టిపోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏకంగా నాగార్జునతో కలిసి 'వైల్డ్‌డాగ్' సినిమాలోనూ నటించాడు. కాగా ఈ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్ కపుల్‌గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే! -
లాక్డౌన్ వేళ..ఆర్థిక అండ
జయనగరం పూల్‌బాగ్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్(ఇమామ్)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక సాయం... లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి 53 లక్షలు సాయం అందనుంది. – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం కష్టకాలంలో ఆదుకుంటున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం. – ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం -
ఆశ్చర్యమేసింది..!
ఏ నటుడికైనా ఓ సినిమా సక్సెస్ అయ్యిందంటే అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ షాహిద్ కపూర్ విషయంలో మాత్రం ఇందుకు విరుధంగా జరిగింది. 2011 షాహిద్ నటిం చిన మౌసమ్ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడడంతో ఇక షాహిద్ పని అయిపోయిందనుకున్నారు సినీ పండితులు. అయితే ఆశ్చర్యకరంగా మౌసమ్ సినిమా వైఫల్యం తర్వాత షాహిద్‌కు ఏకంగా 18 సిని మాల్లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందు ‘వివాహ్’ చిత్రంలో నటించిన షాహిద్ ఆ తర్వాత అవకాశాల్లేక దాదాపు ఆరు నెలలపాటు ఖాళీ గానే ఉన్నాడు. ‘వివాహ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణలే లభించినా ఒక్క అవకాశం కూడా రాలేదు. దీంతో ఎంతో శ్రమపడి ‘మౌసమ్’లో అవకాశం దక్కించుకొని, సిని మా బాగా వచ్చేందుకు మరింతగా కష్టపడ్డాడు. ‘అంచనాలు తారుమారు కావడంతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయా. అయితే ఆ తర్వాత 18 సిని మాల్లో నటించే అవకాశం రావడంతో ఆశ్చర్యమేసింద’ని చెప్పాడు షాహిద్. తాజా చిత్రం ‘ఆర్ రాజ్‌కుమార్’ హిట్ కావడం సంతోషంగా ఉందన్నాడు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని, రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న లోటును ఈ సినిమా తీర్చేసిందన్నాడు. ‘నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంతగా ఆదరిస్తున్న తీరు చూస్తుంటే నమ్మలేకపోతున్నా. స్వయంగా థియేటర్లకు వెళ్లి కూడా చూశా. ఆనందంగా అనిపిం చింది. ప్రతివ్యక్తి తన కెరీర్‌ను చిన్న చిన్న మైలురాళ్లతోనే నిర్మించుకోవాలి. నా జీవితంలో ఈ సినిమా విజయం కూడా ఓ మైలురాయి వంటిదేనని భావిస్తున్నాను. అయితే జీవితంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. సాధించాల్సింది కూడా చాలా ఉంది. ఈ సినిమా విజయం నాకు మరిన్ని అవకాశాలు తెస్తుందా? లేదా? అనేదాని గురించి ఆలోచించడంలేదు. అయితే ఇప్పటికే కొంతమంది నిర్మాతలు నన్ను సంప్రదించారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా’నన్నారు.