ఆశ్చర్యమేసింది..!
ఆశ్చర్యమేసింది..!
Published Mon, Dec 23 2013 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
ఏ నటుడికైనా ఓ సినిమా సక్సెస్ అయ్యిందంటే అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ షాహిద్ కపూర్ విషయంలో మాత్రం ఇందుకు విరుధంగా జరిగింది. 2011 షాహిద్ నటిం చిన మౌసమ్ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడడంతో ఇక షాహిద్ పని అయిపోయిందనుకున్నారు సినీ పండితులు. అయితే ఆశ్చర్యకరంగా మౌసమ్ సినిమా వైఫల్యం తర్వాత షాహిద్‌కు ఏకంగా 18 సిని మాల్లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందు ‘వివాహ్’ చిత్రంలో నటించిన షాహిద్ ఆ తర్వాత అవకాశాల్లేక దాదాపు ఆరు నెలలపాటు ఖాళీ గానే ఉన్నాడు.
‘వివాహ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణలే లభించినా ఒక్క అవకాశం కూడా రాలేదు. దీంతో ఎంతో శ్రమపడి ‘మౌసమ్’లో అవకాశం దక్కించుకొని, సిని మా బాగా వచ్చేందుకు మరింతగా కష్టపడ్డాడు. ‘అంచనాలు తారుమారు కావడంతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయా. అయితే ఆ తర్వాత 18 సిని మాల్లో నటించే అవకాశం రావడంతో ఆశ్చర్యమేసింద’ని చెప్పాడు షాహిద్. తాజా చిత్రం ‘ఆర్ రాజ్‌కుమార్’ హిట్ కావడం సంతోషంగా ఉందన్నాడు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని, రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న లోటును ఈ సినిమా తీర్చేసిందన్నాడు.
‘నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంతగా ఆదరిస్తున్న తీరు చూస్తుంటే నమ్మలేకపోతున్నా. స్వయంగా థియేటర్లకు వెళ్లి కూడా చూశా. ఆనందంగా అనిపిం చింది. ప్రతివ్యక్తి తన కెరీర్‌ను చిన్న చిన్న మైలురాళ్లతోనే నిర్మించుకోవాలి. నా జీవితంలో ఈ సినిమా విజయం కూడా ఓ మైలురాయి వంటిదేనని భావిస్తున్నాను. అయితే జీవితంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. సాధించాల్సింది కూడా చాలా ఉంది. ఈ సినిమా విజయం నాకు మరిన్ని అవకాశాలు తెస్తుందా? లేదా? అనేదాని గురించి ఆలోచించడంలేదు. అయితే ఇప్పటికే కొంతమంది నిర్మాతలు నన్ను సంప్రదించారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా’నన్నారు.
Advertisement
Advertisement