చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు
మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన నగర మేయర్
‘ఖుర్షీద్ జా దేవుడి’ కట్టడాన్ని సందర్శించిన మాజిద్
శాలిబండ : గ్రేటర్ పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. కట్టడాల మరమ్మతులు, పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. శనివారం ఆయన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి చారిత్రక కట్టడమైన ‘ఖుర్షీద్ జా దేవుడి’ని సందర్శించారు.
ఈ కట్టడం పెచ్చులూడుతుండడాన్ని గమనించిన మాజిద్ హుస్సేన్ వెంట నే మరమ్మతులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచిం చారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవి ష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేపట్టి వీటికి మరింత వన్నె తెస్తామన్నారు.
ఈ పనుల ను కుడా ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. దారుషిఫాలోని పాత పాస్పోర్టు కార్యాలయాన్ని కూడా ఆయ న సందర్శించారు. కార్యక్రమంలో హుస్సేనీ ఆలం కార్పొరేటర్ మీర్ జుల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు అసద్ ఖాద్రీ పాల్గొన్నారు.