ఐసెట్‌కు 74,448 మంది అభ్యర్థులు
19న పరీక్ష, 21న ప్రాథమిక కీ, 31న ఫైనల్ కీ, ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్-2016కు ఇప్పటి వరకు 74,448 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. గత ఏడాదిలో ఐసెట్‌కు 69,232 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. మంగళవారం కేయూలో ఐసెట్ రీజినల్ కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
ఈ నెల 19న ఐసెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19న పరీక్ష, 21న ప్రాథమిక కీ, 31న తుది కీ విడుదల, ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు.