McDonalds restaurants
-
మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం
కొన్ని కొన్ని పనులు సదుద్దేశంతో చేసినప్పటికీ ఒక్కొసారి మనకు తెలియకుండానే అవి పెద్ద పెద్ద వివాదాలకు దారితీసేలా తయారువుతాయి. అచ్చం అలాంటి పరిస్థితినే బ్రెజిల్‌లోని ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ఎదుర్కొంటుంది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) అసలు విషయంలోకెళ్లితే....బ్రెజిల్లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయిలెట్ బాత్రూమ్ పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ యూనిసెక్స్ టాయిలెట్ రూమ్‌ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్‌డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకేలాంటి టాయిలెట్ రూమ్ లేంటి అంటూ ఒక మహిళ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. పైగా చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినయోగిస్తారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న ఒక ఆడియో క్లిప్‌ను కూడా ఆరోగ్య అధికారులకు పంపించారు . దీంతో ఆరోగ్య అధికారులు మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌ని సందర్శించడమే కాక ఆరోగ్య నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా నిమిత్తమే కాక అందురూ గుర్తించే విధంగా పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్ రూంలు ఉండాల్సిందేనని చెప్పారు. పైగా రెస్టారెంట్లో రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్ రూంలు ఏర్పాటు చేయాలని లేనట్టయితే మూసివేయడం లేదా జరిమాన వంటి చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందంటూ అధికారులు హెచ్చరించారు. అయితే మెక్‌డొనాల్డ్స్ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించడానికి స్వాగతించేలా కొద్దిపాటు మార్పులతో ఈ బాత్రూంలు రూపొందించామని అంతేకాక నిర్థిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధికారులకు సహరికరిస్తామంటూ వివరణ ఇచ్చుకుంది. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) -
అప్పుడు జొమాటో..ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తరహాలో ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘మేము హాలాల్ మాంసం కూడా సరఫరా చేస్తాం’ అనే ట్యాగ్‌తో జొమాటో చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విమర్శల వర్షం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మెక్‌డొనాల్డ్స్ ఇండియాపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘మెక్‌డొనాల్డ్స్ ఇండియా హలాల్ సర్టిఫికెట్ ను కలిగి ఉందా’ అని ఓ కస్టమర్ అడిగిన ప్రశ్నకు బదులుగా.. భారతదేశంలోని వారి రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్ ఉందని, వారు ఉపయోగించే మాంసం కూడా అత్యధిక నాణ్యతతో ఉంటుందని మెక్‌డొనాల్డ్స్ సమాధానం ఇచ్చింది. అంతేకాక వాటికి ప్రభుత్వ ఆమోదం పొందిన హేచ్ఎసీసీపీ(హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్) సర్టిఫికేట్ కూడా ఉందని తెలిపింది. అదేవిధంగా ‘మా రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. కావాలంటే సంబంధిత రెస్టారెంట్ యజమానులను ధృవీకరణ పత్రాన్ని చూపించమని అడిగి మీ సందేహన్ని తీర్చేకోవచ్చు’ అంటూ ట్విటర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలో ముస్లిమేతర మెజారిటీ దేశంలో హలాల్ మాంసం విక్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మెక్‌డొనాల్డ్స్ ఇండియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్కాట్మెక్డొనాల్డ్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన తెలియజేస్తున్నారు. ‘హిందువులు జాట్కా మాంసాన్ని మాత్రమే తింటారు, మన సంప్రదాయం కూడా అదే చెబుతోంది. ఇప్పటికైనా మీరు దీన్ని ఆపకుంటే మీ వద్ద మాంసాహర పదార్థాల విక్రయాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అప్పడు మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా జూలై నెలలో జొమాటో ‘ఆహారానికి మతం లేదు’ అని ట్విటర్ పోస్ట్ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘ఆహారానికి మతం లేనప్పడు మరెందుకని హలాల్ మాంసం అని ప్రత్యేకంగా ట్యాగ్‌ను చేర్చారు’ అంటూ విమర్శించారు. Thank you for taking the time to contact McDonald's India. We truly appreciate this opportunity to respond to your comments. The meat that we use, across our restaurants, is of the highest quality and is sourced from government-approved suppliers who are HACCP certified. (1/2) — McDonald's India (@mcdonaldsindia) August 22, 2019 -
మెక్‌డొనాల్డ్స్ వార్నింగ్ : అక్కడ తింటే ఖతమే
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ తన కస్టమర్లకు వార్నింగ్ ఇస్తోంది. నార్త్, ఈస్ట్ ఇండియాలో కొనసాగుతున్న తమ బ్రాండెడ్ అవుట్లెట్లలో తినొద్దంటూ కస్టమర్లకు సీరియస్ హెచ్చరికలు జారీచేస్తోంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు(సీపీఆర్ఎల్) నిర్వహిస్తున్న తమ ఈ బ్రాండెడ్ అవుట్లెట్లలో తింటే, ఆరోగ్య సమస్యల బారిన పడతారంటూ పేర్కొంటోంది. ఈ రెస్టారెంట్లలో వాడే పదార్థాలు, తమ అంతర్జాతీయ ప్రమాణాకలు అనుగుణంగా లేవని మెక్‌డొనాల్డ్స్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. సీపీఆర్ఎల్ వీటిని మూత వేయాల్సి ఉందన్నారు. సీపీఆర్ఎల్, మెక్ డొనాల్డ్స్ ఇండియా జాయింట్ వెంచర్ 50:50గా ఉంది. ఈ జాయింట్ వెంచర్లో 160 అవుట్లెట్లు కొనసాగుతున్నాయి. వీటిలో 84 అవుట్లెట్లు ఈ వారం ప్రారంభంలో మూతపడ్డాయి. బకాయిలు చెల్లించని కారణంగా సీపీఆర్ఎల్ లాజిస్టిక్స్ పార్టనర్ రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ తన సర్వీసులను రద్దు చేసింది. ఈ కారణంతో అవుట్లెట్లు కూడా క్లోజయ్యాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ రద్దు చేసినప్పటి నుంచి బర్గర్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌కు, సీపీఆర్‌ఎల్‌కు న్యాయపోరాటం నడుస్తోంది. ఈ వివాదంతో అనేక సరఫరాదారులు బయటికి వచ్చేసినప్పటికీ, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నప్పటి నుంచి సీపీఆర్ఎల్ అనధికారికంగా రెస్టారెంట్లను నిర్వహిస్తోందని, మెక్‌డొనాల్డ్స్ సిస్టమ్‌లోకి సరఫరా చేసేందుకు తెలియని డిస్ట్రిబ్యూటర్ను తాము ఆమోదించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మెక్‌డొనాల్డ్స్ ఆరోపణలపై స్పందించిన సీపీఆర్ఎల్ ఎండీ విక్రమ్ భక్షి, రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ కంటే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌ను నియమించుకున్నట్టు తెలిపింది. లాజిస్టిక్స్ పార్టనర్‌గా కోల్డ్ఎక్స్ను ఎంపికచేసుకున్నట్టు పేర్కొంది. కేఎఫ్‌సీ, స్టార్‌బక్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, వెండీస్ అండ్ కార్ల్స్ జూనియర్, ఏడీబీ వంటి వాటికి కోల్డ్ఎక్స్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది. -
మెక్‌డొనాల్డ్స్‌కి గుడ్‌బై: సగం పైగా మూత
మెక్‌డొనాల్డ్స్ బర్గర్, పిజ్జా... అంటే పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. ఫుల్‌గా ఆస్వాదిస్తూ తెగ లాగించేస్తూ ఉంటారు. అయితే మెక్‌డొనాల్డ్స్‌కు, కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) మధ్య నెలకొన్న వివాదంతో, సగానికి పైగా ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ అవుట్లెట్లు మూత పడ్డాయి. లాజిస్టిక్స్ పార్టనర్ల వద్ద నుంచి సరఫరా లేకపోవడంతో వీటిని మూత వేస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ జాయింట్ వెంచర్ పార్టనర్ విక్రమ్ భక్షి తెలిపారు. తూర్పు భారతంలో అన్ని అవుట్లెట్లు, ఉత్తర భారతంలో పలు అవుట్లెట్లు మొత్తం 80 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే కొన్ని రోజుల్లో మరిన్ని అవుట్లెట్లు కూడా మూతపడబోతున్నట్టు పేర్కొన్నారు. రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తను అందించే సర్వీసులను అకస్మాత్తుగా ఆపివేసిందని, పీక్ సీజన్లో ఇలా ఆపివేయడం పలు అనుమానాలకు తావిస్తుందని భక్షి చెప్పారు. సీపీఆర్ఎల్ భక్షి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్యనున్న 50:50 జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్లో 160 అవుట్లెట్లను నడుపుతున్నారు. సర్వీసులు ఆపివేయడంపై రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్, కూడా సీపీఆర్‌ఎల్‌కు లేఖ రాసింది. వాల్యుమ్ తగ్గడం, భవిష్యత్తుపై అనిశ్చిత వంటి పలు కారణాలతో సప్లయ్ చైన్ సర్వీసులను ఆపివేస్తున్నామని రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తెలిపింది. పండుగ సీజన్లో మెక్‌డొనాల్డ్స్‌కు భారీ ఎత్తున్న బిజినెస్ నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ సర్వీసులు ఆపివేయడం, దీని రెవెన్యూలపై ప్రభావం చూపనుంది. -
మెక్‌డీలో ఇక మసాలా దోశ బర్గర్లు, అండా బుర్జీ!
ఇంతకాలం పీజాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ విదేశీ రుచులను మాత్రమే అందిస్తూ వచ్చిన బహుళజాతి సంస్థ మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్ ఇప్పుడు దారి మార్చుకుంది. మసాలా దోశ బర్గర్లు, మొలాగా పోడి సాస్, అండా భుర్జీ.. ఇలాంటి వాటన్నింటినీ తన బ్రేక్‌ఫాస్ట్ మెనూలో చేరుస్తోంది. ముంబైలో త్వరలోనే మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంటులో ఈ స్వదేశీ బ్రేక్‌ఫాస్ట్ మెనూ రానుంది. ఇంతకాలం ఫ్రై ఐటెమ్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టిన ఈ సంస్థ.. ఈ కొత్త రుచులను మాత్రం గ్రిల్డ్ పద్ధతిలో అందిస్తామని చెబుతోంది. ముంబైలోని మొత్తం 44 మెక్‌డీ ఔట్లెట్లలో ఈనెల 13 నుంచి కొత్త రుచులు అందుబాటులోకి వస్తాయి. రూ. 30 నుంచి రూ. 135 వరకు ధరలలో ఇవి ఉన్నాయి. మెక్‌డెలివరీ, టేకెవే కియోస్క్‌ల ద్వారా కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను అందిస్తామని చెబుతున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా ఈ కొత్త మెనూను అందిస్తామన్నారు. ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్ సెగ్మెంటులోకే వస్తున్నారని, అందువల్ల ఈ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ అమిత్ జతియా చెప్పారు. ఈ సంస్థ పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లోని 240 మెక్‌డీ రెస్టారెంటులను నిర్వహిస్తోంది. అందుకోసమే తాము వెస్ట్రన్ సర్వీసుల కంటే భారతీయ బ్రేక్‌ఫాస్ట్ మార్కెట్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు.