మెక్‌డొనాల్డ్స్ బర్గర్, పిజ్జా... అంటే పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. ఫుల్‌గా ఆస్వాదిస్తూ తెగ లాగించేస్తూ ఉంటారు. అయితే మెక్‌డొనాల్డ్స్‌కు, కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్‌ఎల్) మధ్య నెలకొన్న వివాదంతో, సగానికి పైగా ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ అవుట్‌లెట్లు మూత పడ్డాయి. లాజిస్టిక్స్ పార్టనర్ల వద్ద నుంచి సరఫరా లేకపోవడంతో వీటిని మూత వేస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ జాయింట్ వెంచర్ పార్టనర్ విక్రమ్ భక్షి తెలిపారు. తూర్పు భారతంలో అన్ని అవుట్‌లెట్లు, ఉత్తర భారతంలో పలు అవుట్‌లెట్లు మొత్తం 80 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే కొన్ని రోజుల్లో మరిన్ని అవుట్‌లెట్లు కూడా మూతపడబోతున్నట్టు పేర్కొన్నారు.
రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తను అందించే సర్వీసులను అకస్మాత్తుగా ఆపివేసిందని, పీక్ సీజన్‌లో ఇలా ఆపివేయడం పలు అనుమానాలకు తావిస్తుందని భక్షి చెప్పారు. సీపీఆర్‌ఎల్ భక్షి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్యనున్న 50:50 జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్‌లో 160 అవుట్‌లెట్లను నడుపుతున్నారు. సర్వీసులు ఆపివేయడంపై రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్, కూడా సీపీఆర్‌ఎల్‌కు లేఖ రాసింది. వాల్యుమ్ తగ్గడం, భవిష్యత్తుపై అనిశ్చిత వంటి పలు కారణాలతో సప్లయ్ చైన్ సర్వీసులను ఆపివేస్తున్నామని రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తెలిపింది. పండుగ సీజన్‌లో మెక్‌డొనాల్డ్స్‌కు భారీ ఎత్తున్న బిజినెస్ నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ సర్వీసులు ఆపివేయడం, దీని రెవెన్యూలపై ప్రభావం చూపనుంది.
Comments
Please login to add a commentAdd a comment