చంద్రబాబుపై ఏసీబీకి ఫిర్యాదు
కరీంనగర్ క్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను డబ్బులతో ప్రలోభపెట్టిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏ1 నిందితుడిగా చేర్చి దర్యాప్తు చేయాలని కోరుతూ కరీంనగర్ జెడ్పీ కో- ఆప్షన్ సభ్యుడు ఎండీ. జమీలోద్దీన్ సోమవారం కరీంగర్ లోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారేనని, అసలు సూత్రధారి మాత్రం బాబేనని, మీడియాలో విడుదలైన ఫోన్ రికార్డులే అందుకు నిదర్శనమని జమీలొద్దీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.