ఈ ఏడాది రూ.900 కోట్ల పెట్టుబడి: అరబిందో
న్యూఢిల్లీ: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2015-16లో రూ.800-900 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. తయారీ సామర్థ్య విస్తరణ, ఔషధ పరీక్షలు, ఉత్పత్తుల నమోదుకు ఈ నిధులను వెచ్చించనుంది. 2014-15లో రూ. 700 కోట్లు ఖర్చు చేసినట్టు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. సంస్థ అనుబంధ కంపెనీ అయిన అమెరికాకు చెందిన ఆరోమెడిక్స్ ఫార్మా నాలుగు ఇంజెక్టబుల్ ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమైందని ఆరోమెడిక్స్ సీఈవో రొనాల్డ్ క్వాడ్రెల్ తెలిపారు. అనుబంధ కంపెనీ ఆక్టావిస్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేయాలని అరబిందో భావిస్తోంది.