MDR charges
-
డెబిట్ కార్డు పేమెంట్లపై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు డిజిటల్ లావాదేవీలపై కేంద్ర కేబినెట్ పలు ప్రోత్సహాకాలను ప్రవేశపెడుతోంది. రూ.2000 వరకు జరిపే డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని, ఈ లావాదేవీలపై వినియోగదారులు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం నిర్ణయించింది. ''అంతకముందు చెల్లించిన ఎండీఆర్‌లను ప్రభుత్వం తిరిగి చెల్లించాలని మేము నిర్ణయించాం. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఎనాబుల్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. చిన్న డిజిటల్ వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఊరట'' అని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కనీసం రెండేళ్ల వరకు రూ.2000 వరకు జరిపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని పేర్కొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులు అందించేందుకు గాను, బ్యాంకులు వసూలు చేసే రుసుం ఎండీఆర్. రూ.2000 కంటే తక్కువగా ఉన్న లావాదేవీలకు బ్యాంకులకు చెల్లించే ఎండీఆర్ విలువ 2018-19లో రూ.1,050 కోట్లగా అంచనావేస్తుండగా.. 2019-20లో రూ.1,462 కోట్లుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల వరకున్న చిన్న వర్తకులకు విధించే ఎండీఆర్ ఛార్జీలు 0.40 శాతంగా నిర్ణయించారు. ఒకవేళ వర్తకుల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే, ఎండీఆర్ ఛార్జీలు 0.90 శాతంగా ఉన్నాయి. -
ఎండీఆర్‌పై శుభవార్త అందించిన ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిటక్రెడిట్ కార్డుల మర్చంట్ డిస్కౌంట్ల రేటు(ఎండీఆర్)పై ఆర్బీఐ పలు మార్పులు చేసింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎండీఆర్ చార్జీలను సవరించినట్టు తెలిపింది. ఈ సవరించిన రేట్లు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టర్నోవర్ ఆధారంగా వ్యాపారులను వర్గీకరించి ఆ మేరకు చార్జీలను వసూలు చేయనుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, వినియోగదారులకు లాభం కలిగేలా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే క్యూఆర్ ఆధారిత లావాదేవీలకు కేంద్ర బ్యాంకు ఒక విభిన్న ఎండీఆర్‌ను కూడా రూపొందించింది. చిరు వ్యాపారులు, చిన్న సంస్థలల్లో కూడా డెబిట్ కార్డ్ లావాదేవీలకు ప్రోత్సాహం, ఉనికిలో ఉన్న చిన్నవ్యాపారాలు, సంస్థల స్థిరత్వానికి భరోసా కల్పించడం అనే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సేవలపై వ్యాపారులకు బ్యాంకులు విధించే చార్జీలను పరిమితం చేస్తామని, వ్యాపారుల కేటగిరీ ఆధారంగా ఈ చార్జీలను విధిస్తామని పేర్కొంది. లావాదేవీ జరిగిన మొత్తం ఆధారంగా ఎండీఆర్ చార్జీలపై పరిమితులు విధిస్తామని వెల్లడించింది. క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతుల్లాగే అసెట్ లైట్ యాక్సెప్టెన్స్ వసతులను కల్పిస్తామని తెలిపింది. తాజాగా సవరించిన రేట్ల ప్రకారంరూ. 20 లక్షల వరకూ టర్నోవర్ కలిగిన వ్యాపారుల ఎండీఆర్ రేటు 0.4 శాతంగా నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవి నిర్వహించినట్లయితే ఇది మరింత తగ్గి 0.3 శాతంగా ఉంటుందని తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షలకు మించి వ్యాపారులకయితే స్వైప్ మెషీన్ ఆధారిత లావాదేవీలకు 0.9 శాతం, క్యూఆర్ కోడ్ ఆధారిత అమ్మకాలకు 0.8 శాతం చార్జీని వసూలు చేస్తుంది. కాగా గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఎండీఆర్‌ను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ తాజాగా మరోసారి చార్జీలను తగ్గించింది. -
కార్డు చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలు తగ్గించే యోచన!
డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం లక్ష్యం న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తగ్గించే విషయాన్ని కేంద్రం యోచిస్తోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు. లావాదేవీల పరిమాణం పెరిగితే ఎండీఆర్‌ను చార్జీలను తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని వివరించారు. ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక ముసాయిదాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచీ డెబిట్ కార్డ్ పేమెంట్లపై ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని ఇటీవలి తన ఒక నివేదికలో ఆర్బీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2,000 వరకూ లావాదేవీపై ఎండీఆర్ పరిమితి 0.75 శాతంకాగా, ఆపైన 1 శాతంగా ఉంది. అయితే ఈ చార్జీల తగ్గింపు డిజిటల్ చెల్లింపుల బాటలో చిన్న వర్తకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆర్బీఐ తన ముసాయిదా పత్రంలో పేర్కొంది. -
డెబిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: డెబిట్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఎండిఆర్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎండిఆర్ రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్టు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు రీఇంబర్స్ చేయనున్నట్టు తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకాన్నిఅమలు చేసే దిశగా జనవరి 1, 2017 నుంచి డెబిట్ కార్డుల మీద టాక్స్ అండ్ నాన్ టాక్స్ బకాయిలను ఆయా బ్యాంకులకు చెల్లించనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకులు ఎండీఆర్ బకాయిల కోసం త్రైమాసిక ప్రాతిపదికన చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ తోపాటు ఆర్బిఐ నాగ్‌పూర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది. అలాగే రూ. ఒక లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారునుండి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బకాయి ల చెల్లింపుల కోసం ఏప్రిల్30 లోగా ఆర్బీఐలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో కోరింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. సంవత్సర కాలానికి గాను రూ.లక్ష నుంచి 2లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకోవచ్చు. కాగా గత ఏడాది డిశెంబర్ లో డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. డీమానిటైజేషన్ అనంతరం డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.